జగన్ ను కలిసిన కేటీఆర్

జగన్ ను కలిసిన కేటీఆర్

                      
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తనయుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఈరోజు హైదరాబాద్ లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తాను ఫెడరల్ ఫ్రంట్ ను పెట్టబోతున్నారని అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బిజెపి పార్టీకి ప్రత్యామ్నాయంగా మూడో కూటమి గా ఇది ఉంటుందని తెలిపిన విషయం మనకు విదితమే. అయితే ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలను కలుస్తూ మద్దతు కోరుతూ వస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ లో కేటిఆర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని కలిసి ఫెడరల్ ఫ్రంట్ విషయాల గురించి చర్చలు జరిపారు.

తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తో జతకట్టి కేసీఆర్ కోసం చాలా ప్రయత్నించారు కానీ అనూహ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. అయితే ఆ తర్వాత కేసీఆర్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి అనేక కుట్రలు పన్ని తెలంగాణ కొట్టాలని ప్రయత్నించారు అందుకు ప్రతిగా ఇప్పుడు తాను కూడా చంద్రబాబు నాయుడు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కేటీఆర్ సడన్గా జగన్  ను  కలవడం చర్చలు జరపం లాంటి వ్యవహారాలు చూస్తుంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నది నిజమేనని ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి మద్దతు తెలపడం ద్వారా పరోక్షంగా జగన్ అధికారంలోకి రావడం ద్వారా చంద్రబాబు నాయుడుకి తాను అనుకుంటున్న రిటర్న్ గిఫ్ట్ ఇవ్వొచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అటుపక్క ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు కూడా అదే సమయం లేదు ఏప్రిల్ లో సాధారణ ఎన్నికలు జరగవచ్చు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈలోపు కేసీఆర్ జగన్ కు తన మద్దతు ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెరాస సానుభూతిపరులు కానీ కేసీఆర్ అభిమానులను విపరీతంగా ప్రభావం చేసి జగన్ పార్టీకి ఓట్లు పడేలా చేయాలనేది కేసీఆర్ వ్యూహంలో భాగం కావచ్చు. అయితే రాజకీయ పార్టీల మధ్య ఇలాంటి వ్యూహప్రతివ్యూహాలు ఉండడం సాధారణమే అయినప్పటికీ ఈ సారి జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేసీఆర్ జగన్ పార్టీకి తన మద్దతు తెలపడం ద్వారా అక్కడ రాజకీయాలను
మరింత వేడెక్కించారు  అనే చెప్పొచ్చు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

Amazing kumbh Mela photos

Wed Jan 16 , 2019
Amazing kumbh Mela photos https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: