జనాల మీద కేబుల్ పిడుగు!!!


Channels Details

మీకు నచ్చిన ఛానెల్ ను మాత్రమే చూడండి. చూసిన దానికి మాత్రమే బిల్లు కట్టండి. ఇది నిన్న మొన్నటివరకు ఊదరగొట్టిన ప్రైవేట్ డీటీహెచ్ హంగామా ఇప్పుడు దీనికి ట్రాయ్, కేంద్రప్రభుత్వం కూడా వత్తాసు పలకడంతో ప్రజల నుంచి మరో కొత్త నిలువుదోపిడీకి రంగం సిద్ధమైంది. నిజం చెప్పాలంటే కిందటి నెలలోనే ఈ పథకం అమలు కావాలి. కానీ దీనికి టైమ్ ను మరో నెలరోజులు పొడిగించారు. ఆ డెడ్ లైన్ కూడా నిన్నటితో పూర్తయింది. ఫలితంగా నిన్నట్నుంచి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా ఇళ్లల్లో కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి సరిగ్గా చెప్పాలంటే మేము చెప్పే ధరలకే మా ఛానెల్స్ కొనాలని సదరు టీవీ చానల్స్ వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు సరికొత్త ప్లాన్స్ అమల్లోకి వచ్చాయి. చల్ల కొచ్చి ముంత దాచినట్టు పైకి నచ్చిన ఛానెల్ కు మాత్రమే డబ్లు చెల్లించండంటూ చెప్పి వినియోగదారుడి జేబుకు చిల్లు వేసే కార్పొరేట్ బృహత్తర మాయాజాలం ఇప్పటికే మొదలయ్యింది. మీకు నచ్చిన ఛానెల్ నే ఎంచుకోండి, కానీ దానికి బేసిక్ ప్లాన్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలనేది రూల్ గా మారింది. బేసిక్ ప్లాన్ కు నచ్చిన ఛానెళ్ల ఫీస్ కూడా కలిపితే లెక్క 300 రూపాయలు దాటిపోతోంది.

అసలు మొన్నటివరకు ఈ ఛానెళ్లన్నీ కేవలం 200 రూపాయల్లోనే వచ్చేవి. ఇప్పుడీ కొత్త రూల్స్ వల్ల ప్రతి వినియోగదారుడు అదనంగా 100 రూపాయల కంటే చెల్లించాల్సిందే. కార్పొరేట్ కంపెనీలకు కోటాను కోట్ల రూపాయల లాభం చేకూర్చే పథకమిది. మొన్నటివరకు యాడ్స్ రూపంలో కోట్లు గడించిన ఈ కార్పొరేట్ ఛానెళ్లన్నీ ఆ యాడ్స్ తో పాటు ఇప్పుడు వినియోగదారుడి నుంచి కూడా డైరెక్ట్ గా డబ్బులు వసూలు చేయబోతోందన్నమాట. ఫర్ ఎక్షంపుల్ ఏదైనా డీటీహెచ్ లో 150 రూపాయల రీచార్జ్ చేసుకుంటే ఉన్నంతలో తెలుగు టీవీ ప్రేక్షకుడికి అవసరమైన ఛానెళ్లన్నీ వచ్చేవి. కానీ లేటెస్ట్ గా విధించిన నియమాల వల్ల అవే ఛానెళ్లు పొందాలంటే ఇప్పుడు కనీసం 230 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బేసిక్ ప్యాక్ (దీన్ని 130 నుంచి 150 మధ్య ఆపరేటర్లు ఫిక్స్ చేశారు) కాకుండా ఏ ఛానెల్ కావాలన్నా అదనంగా చెల్లించుకోవాలన్నమాట.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు రెగ్యులర్ గా చూసే ఈటీవీ, జెమినీ, స్టార్ మా, జీ తెలుగు.. ఇలా ఏ ఛానెల్ ఇప్పుడు బేసిక్ ప్యాకేజీలో ఉండదు. కనీసం వాటి అనుబంధ ఛానెల్స్ కూడా ఉచితంగా రావు. ఇవన్నీ కావాలంటే 150కి అదనంగా మరో 120 రూపాయలు చెల్లించాలి. అంటే ఇప్పటివరకు నెలకు 150 చెల్లిస్తే, ఇకపై జీఎస్టీతో కలుపుకొని దాదాపు గా 300 రూపాయల వరకు బిల్లు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు టీవీలో ఏ ఛానెల్ పెట్టినా కామన్ గా ఓ యాడ్ కనిపిస్తుంది. మా ఛానెల్స్ అన్నీ 27 రూపాయలే అని ఒకరు చెబుతారు. ఒక నెట్ వర్క్ లో 10 ఛానెల్స్ 40 రూపాయలే అని మరొకరు చెబుతారు. ఇంకొకరేమో ప్యాక్ మొత్తం 24 రూపాయలే అంటారు. విడివిడిగా చూస్తే ఇవన్నీ చవకగానే కనిపిస్తాయి.

కానీ అక్కడే అసలు కథ ఉంది. నిజానికి బేసిక్ ప్యాక్ కు ఇవన్నీ కలుపుతూపోతే బిల్లు 300 దాటిపోతుంది. ఇంకాస్త ఆశపడి ఇంగ్లిష్ మూవీస్, క్రికెట్, మ్యూజిక్ లాంటివి కూడా సెలక్ట్ చేసుకున్నామంటే నెలకు 400 రూపాయలు సమర్పించుకోవాల్సిందే. ఇవన్నీ మొన్నటివరకు 200 రూపాయలకే లభించేవి.ఇంతకు ముందు నాణ్యత పేరిట సెట్ టాప్ బాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టి వినియోగదారుడ్ని నిలువునా ముంచారు. వెయ్యి నుంచి 2 వేల రూపాయలు ముక్కుపిండి వసూలు చేశారు. ఇప్పుడేమో నచ్చిన ఛానెల్ కు మాత్రమే డబ్బులు కట్టండంటూ మరో డ్రామాకు తెరతీశాయి ఈ కార్పొరేట్ కంపెనీలు.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

మహేష్ బాబు సాయిపల్లవి ఫిక్స్??

Mon Mar 4 , 2019
సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టు ఓకె అయిపోయింది. F 2 తో సంక్రాంతి కి మాంచి హిట్ కొట్టిన అనిల్ రావిపూడి డైరక్టర్. నిర్మాతలు దిల్ రాజు-అనిల్ సుంకర కలిసి ఈ చిత్రం నిర్మిస్తారు. ఈ మధ్య కాలంలో అన్నీ హిట్ సినిమాలే చేస్తున్న దేవీశ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ అందించబోతున్నారు. అయితే ఇక్కడే అసలు మెలిక పడింది సినిమాకి మెయిన్ వాళ్లంతా ఓ కే అయ్యారు కానీ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: