“జెర్సీ” సినిమా రివ్యూ

టైటిల్ : జెర్సీ

సంగీతం : అనిరుధ్‌ రవిచందర్‌
దర్శకత్వం : గౌతమ్‌ తిన్ననూరి
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ

నటీనటులు : నాని, శ్రద్దా శ్రీనాథ్‌, సత్యరాజ్‌ తదితరులు
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఎమోషనల్ జర్నీ జెర్సీప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మళ్లీ రావావంటి ఫీల్ గుడ్ మూవీతో దర్శకుడిగా ప్రశంసలు దక్కించుకున్న గౌతమ్ తిన్ననూరి క్రికెట్ నేపథ్యంలో జెర్సీచిత్రాన్ని తీశాడు. విజయం కోసం చేసే ప్రయత్నాల్లో ఎన్నిసార్లు ఓడిపోయినా తప్పు లేదు. కానీ, అసలు ప్రయత్నం చెయ్యడంలోనే ఓడిపోవడం సరికాదు. అలా మొదలైన భావోద్వేగ పోరాటమే జెర్సీ.


నేచురల్స్టార్ నాని ఓ సినిమా చేస్తున్నాడంటే.. ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. దానికి కారణం నాని యాక్టింగ్ స్కిల్సే. అలాంటి నాని ఈ మధ్య డీలాపడ్డాడు. దేవదాస్‌, కృష్ణార్జున యుద్దం లాంటి కమర్షియల్‌ సినిమాలు చేసి భంగపడ్డాడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని మళ్లీ తన రూట్ లోకి వచ్చేశాడు. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాన్ని ఎంపిక చేసుకున్నాడు. మళ్లీ తన సత్తా చాటేందుకు “జెర్సీ”తో ఈ శుక్రవారం(ఏప్రిల్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ “జెర్సీ”తో నాని మళ్లీ హిట్ కొట్టాడా? లేదా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
క్రికెట్ అంటే ప్రాణమిచ్చే అర్జున్ (నాని) పెళ్లి చేసుకున్నాక క్రికెట్ కు దూరం కావాల్సి వస్తుంది. సంసార జీవితంలో పడిపోయిన అర్జున్ కి పదేళ్ల తర్వాత తన కల అయిన క్రికెట్ పై మనసు మళ్లుతుంది. తన లక్ష్యం కోసం మళ్లీ బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి అడుగుపెడతాడు. అయితే లేట్ ఏజ్ లో అర్జున్ తన లక్ష్యం అందుకున్నాడా? ఆ లక్ష్య సాధనలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. స్టోరీ లైన్ చాలా సాదాగా అనిపిస్తుంది. కానీ దాన్ని స్క్రీన్ ప్లే తో ఎమోషనల్ రైడ్ గా మార్చటం మాత్రం మెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా కథని 1986,1996, 2018 సంవత్సరాలలో చూపించిన తీరు ఆకట్టుకుంది.
నటీనటులు : 
అర్జున్ పాత్రను ఎమోషనల్ రైడ్‌గా మార్చేశారు దర్శకుడు. జెర్సీఅనే సింపుల్ లైన్‌ తీసుకుని దాన్ని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మాయ చేశారు. 1986 నాటి కథను ప్రజెంట్ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యేలా నడిపించిన తీరు అద్భుతం అనే చెప్పాలి. ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్‌కి కంటతడి పెట్టని ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే జెర్సీ కథ మొత్తం క్రికెట్ నేపథ్యంలో ఉండటంతో క్రికెట్‌ను ఇష్టపడని వాళ్లకు ఈ కథ అంతగా రుచించకపోవచ్చు.


 ఫస్టాఫ్ సాఫీగా నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో కథను మరింత వేగంగా నడపడంతో పాటు.. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడు ఊహించని స్థాయిలో ఉంటుంది. బరువెక్కిన గుండెలతో థియేటర్ బయటకు వచ్చేలా చేసింది. చివరి పది నిమిషాలు గుండెల్ని పిండేసే సన్నివేశాలతో అద్భుతంగా ఆవిష్కరించారు. నాని నుంచి ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆశించే కామెడీ లేకపోవటం, కంటతడి పెట్టించే సన్నివేశాలు మరీ ఎక్కువగా ఉండటం లాంటివి సినిమాను కొన్ని వర్గాలకే పరమితం చేసే అవకాశం ఉంది. ప్రీ క్లైమాక్స్‌లో పూర్తిగా ఆట నేపథ్యంలో సాగుతుంది.

అర్జున్‌పాత్రలో నానిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. అంతగా నాని ఆ పాత్రలో జీవించాడు. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గానూ, నార్మల్‌ ఫ్యామిలీ పర్సన్‌గానూ మెప్పించాడు. కొడుకుని అపురూపంగా చూసుకుంటూ.. తనే ప్రపంచంలా బతికే తండ్రి పాత్రలో జీవించాడు. ఇక సారా పాత్రలో శ్రద్దా శ్రీనాథ్‌ మంచి మార్కులు కొట్టేసింది. ప్రేయసిగానూ, భార్యగానూ రెండు పాత్రల్లో సహజంగా నటించింది. లుక్స్‌పరంగానూ ఆకట్టుకుంది. ఇక కోచ్‌గా, స్నేహితుడిగా నిత్యం అర్జున్‌ పక్కనే ఉండి నడిపించే సత్య రాజ్‌.. తన పాత్రకు న్యాయం చేశాడు. నాని స్నేహితులుగా నటించిన వారు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు. రావు రమేష్, ప్రవీణ్ తదితర నటీనటులు ఉన్నంతలో బాగానే చేశారు.

టెక్నికల్ పరంగా ఈ సినిమాకి పాటలతో పాటు అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం హైలైట్. ఎమోషనల్ సీన్స్‌లో అనిరుధ్ మంచి నేపథ్య సంగీతం అందించి సీన్స్ పండేలా చేశారు. 1986 నాటి పరిస్థితులతో.. పీరియాడిక్‌ నేపథ్యంలో సాగిన ఈ కథకు ఆర్ట్ వర్క్‌తో పాటు.. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా జాన్ వర్గీస్ కెమెరా జిమ్మిక్కులతో రెండున్నర గంటల క్రికెట్ వినోదాన్ని అందించారు. నిజంగా క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫీల్ కలిగించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


ఈ సినిమా పూర్తిగా దర్శకుడు ప్రతిభా ప్రదర్శన అనే చెప్పాలి. ఎందుకంటే ఇదే కథను వేరే దర్శకుడు డీల్ చేస్తే ఇంత నైపుణ్యంతో నడపలేడు. ముఖ్యంగా నటుడిగా నాని బలాలు, బలహీనతలను కరెక్ట్ అంచనా వేసి ఆ కొలతల్లోనే సినిమాని చూపించాడు. జీవితంలో ఇంకేమీ చెయ్యలేము అనుకుని మిడిల్ లైఫ్ క్రైసిస్ ని ఎదుర్కొనే వ్యక్తి..మళ్లీ తనను ప్రూవ్ చేసుకుని తనకు ఆత్మధైర్యాన్ని, తన కొడుక్కు గర్వాన్ని గిప్ట్ గా అందిస్తాడు అనేది చూపించటంలో డైరక్టర్ పూర్తి గా సక్సెస్ అయ్యారు.
మైనస్: 
సినిమా నిడివి
స్లో నెరేషన్‌
 jersey

ప్లస్:
నాని నటన
శ్రద్దా శ్రీనాథ్ గ్లామర్ ప్లస్ యాక్టింగ్
నేపథ్య సంగీతం
ఎమోషనల్ సీన్స్
డైరెక్షన్
 #shraddha srinathhttps://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

జూనియర్ ఎన్టీఆర్ సరసన జాహ్నవి

Sat Apr 20 , 2019
జూనియర్ ఎన్టీఆర్ సరసన జాహ్నవి కుటుంబ పరిస్థితుల కారణంగా డైసీ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. హఠాత్తుగా ఈ నిర్ణయం చెప్పడంతో ఆమె స్థానంలో ఎవరిని ఉంచాలా అనే ఆలోచనలో పడ్డారు రాజమౌళి. ఇందుకు ఇద్దరు హీరోయిన్లలో ఒకరిని ఎంపిక చేసుకోనున్నట్లు సమాచారం. శ్రద్ధాకపూర్, జాహ్నవికపూర్‌ల పై రాజమౌళి దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. శ్రద్ధాకపూర్”సాహో” చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఆమె టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. ‘బాహుబలి‘ తర్వాత […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: