టాప్ టెన్ బాలీవుడ్ మూవీస్ 2018

టాప్ టెన్ బాలీవుడ్ మూవీస్ 2018

1. అందాదున్ఆయుష్మాన్ ఖురానా హీరోగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాధికా ఆప్టే ముఖ్య పాత్రలు పోషించారు. ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో ఒక గుడ్డి పియానో ప్లేయర్ గా నటించాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

2. బదాయి హోఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ సినిమా కి అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకుడు. 45 ఏళ్ల వయసులో ఉన్న తన తల్లి ప్రెగ్నెంట్ అని తెలియడంతో ఆమె కొడుకు ఏం చేశాడు అన్న ఇతివృత్తంతో ఈ సినిమా వచ్చింది. కథ పరంగా చాలా కొత్త పాయింట్ కావడంతో ప్రేక్షకులు నుంచి ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభించింది. సినిమాల్లో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ విలువల గురించి చాలా చక్కగా చూపించారు. ఈ సంవత్సరం బాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలిచి 150 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది.

3. స్త్రీరాజ్ కుమార్ రావు హీరోగా నటించిన ఈ సినిమాకి అమర్ కౌశిక్ దర్శకుడు. తెలుగు వాళ్ళయినా రాజ్, డికే ఈ సినిమాకి కథ అందించడంతో పాటు నిర్మాతలు గా వ్యవహరించారు. 1980, 90 వ దశకంలో భారతదేశంలోని గ్రామాల్లో ఓ స్త్రీ రేపు రా అన్న పుకార్లను గురించి ఓ కల్పిత కథ గా వచ్చిన ఈ సినిమా 100 కోట్ల రూపాయల కలక్షన్స్ ను సాధించింది.

4.ప్యాడ్ మాన్అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఆర్.బాల్కీ దర్శకుడి గా వ్యవహరించారు. తన కుటుంబ సభ్యుల సమస్యను తన గ్రామం గ్రామంలో ఉన్న సమస్యలను చూసిన ఒక సాధారణ వ్యక్తి ఇలా ప్యాడ్ మాన్ గా మారి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు అనేదే ఈ చిత్ర కథ ఈ సంవత్సరానికి గాను ఈ సినిమా కూడా 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించింది.

5. పరమాణు.1999లో వాజ్పేయి సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం దగ్గర జరిగిన అణు పరీక్షల ఆధారంగా నిర్మితమైన ఈ సినిమా మొట్టమొదటిసారిగా శాంతి కాముకులు గా పేరుగాంచిన భారతదేశం అణ్వస్త్ర పరీక్షలు ఎలా జరి పింది అన్న విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించింది.

6. రాజి
1970వ దశకంలో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. దేశ రక్షణ కోసం శత్రు దేశాల రాష్ట్రాలను తెలుసుకోవడానికి రాజీ అనే ఒక ముస్లిం యువతి ఎలా పాకిస్తాన్ లో ఉన్న ఒక కమాండర్ కొడుకుని వివాహం చేసుకుని అక్కడికి వెళ్లింది భారత దేశం కోసం తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా అక్కడ ఎలా పోరాడింది అన్నది ఈ చిత్ర కథ. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అలియా భట్, వికీ కౌశల్ ముఖ్య పాత్రలు పోషించారు.

7. మంటోప్రముఖ నటి దర్శకురాలు నందితాదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికి సాదత్ హుస్సేన్ అనే ఒక రచయిత పాత్రను పోషించారు. 1940 బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో దేశ విభజన జరగక ముందు హుస్సేన్ అనే రచయిత జీవితం ఎలా ఉంది అన్న దాన్ని చూపించారు.

8. సంజుబాలీవుడ్ నటుడు వివాదాలకు పెట్టింది పేరైన సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా నిర్మితమైన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించారు. మున్నాభాయ్, ఎంబీబీఎస్ త్రీ ఇడియట్స్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన రాజు హిరాణి ఈ సినిమాకి దర్శకుడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.

9. కార్వాన్విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ మలయాళ హీరో  మొదటిసారిగా కలిసి నటించిన ఈ సినిమా ఒక రోడ్ ట్రిప్ డ్రామా గా వచ్చింది. ఆకర్శ్ ఖురాన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తెలుగు నటి అమల ఒక ముఖ్య పాత్ర పోషించింది.

10. లైలా మజ్నుఅవినాష్ తివారి తృప్తి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సజిద్ అలి దర్శకుడు. ఒక లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో మంచి ఎమోషన్స్ ఉంటాయి. చిన్న సినిమాగా వచ్చినా కూడా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ తో పాటు నుంచి క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ రాబట్టింది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

అడివి శేషు ఎమర్జింగ్ స్టార్ అఫ్ ది ఇయర్

Wed Dec 26 , 2018
అడివి శేషు ఎమర్జింగ్ స్టార్ అఫ్ ది ఇయర్ Image credited from google.com అడవి శేషు వినాయకుడు సినిమా డైరెక్టర్ అడవి సాయికిరణ్ తమ్ముడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ తనకంటూ ఒక సొంత గుర్తింపును తెచ్చుకున్నాడు అడివి శేష్. కర్మ అనే సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహించి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ యువ హీరో […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: