0.6 C
New York
January 26, 2021
CINEMA RASCALS
Entertainment News Movies reviews Trending Now

టైటిల్ వివాదంలో ప్రముఖ దర్శకుడు!!!!

టైటిల్ వివాదంలో ప్రముఖ దర్శకుడు!!!!

బాలీవుడ్ బ్యాడ్ బాయ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో నిలుస్తు ఉంటారు. కరన్ జోహార్ మొదటి నుంచి తను చేసే సినిమాల విషయంలో అలాగే తను హోస్ట్ చేసే టీవీ ప్రోగ్రామ్స్ ద్వార కూడా బాగా కాంట్రవర్సిలు అవుతుంటాయి. ఆ మధ్య ఇండియన్ క్రికెటర్స్ హార్దిక్ పాండ్యా అలాగే రాహుల్ కరణ ప్రోగ్రాం లో పాల్గొనడం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అలాగే హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  మరణం, బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం వ్యవహారాల్లో ఆయనపై విమర్శల వర్షం కురిసింది. సుశాంత్  చావుకు నువ్వే కారణం అంటూ సుశాంత్ అభిమానులు కరణ్ పై విమర్శలు చేసారు.  కరణ్ అటూ కొత్తవాళ్లను ఎదగనీయకుండా అడ్డుపడుతున్నారని కూడా విమర్శలు ఎదుర్కున్నారు.

కరణ్ జోహార్ మీద వివాదాస్పద నటి కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా విమర్శల దాడి చేశారు. అయితే ఆ సమయంలో కరణ్ జోహార్ సపోర్టర్స్ మాత్రం సుశాంత్ మరణంపై  కరణ్ తీవ్ర విషాదంలో ఉన్నారని చెపితే ఆ మరుసటి రోజే జరిగిన బర్త్ డే వేడుకలో జాలీగా ఉన్న కరణ్ ఫోటోలు బయటకు రావడంతో మరోసారి అతడిపై విమర్శలు వచ్చాయి. అయితే అలాంటి కరణ జోహార్ ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచారు దానికి కారణం ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర బండార్కర్ ఒక సినిమా కోసం తాను రిజిస్టర్ చేసుకున్న ఓ సినిమా టైటిల్ ని కరణ్ నైతికంగా వాడుకున్నారని తీవ్రంగా విమర్శహించారు. మధుర్ బండార్కర్ తాను ‘ బాలీవుడ్ వైవ్స్  అనే పేరుతో సినిమా చేస్తున్నానని ఆ సినిమా షూటింగ్ కూడా జరుగుతోందని చెప్పారు. 


అయితే కరణ్ ఒకసారి తన దగ్గరికి వచ్చి తను తీస్తున్న ఒక వెబ్ సిరీస్ కి తన టైటిల్ సెట్ అవుతుంది కాబట్టి ఆ టైటిల్ తనకు ఇవ్వాలని తనను  అడిగాడని అయితే తను ఇవ్వలేదని  కానీ కరణ్ మాత్రం తన టైటిల్ ని మార్చి ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ ‘ అని అతని వెబ్ సిరీస్ కు టైటిల్ పెట్టుకున్నాడని కనీసం తనకు మాట కూడా చెప్పలేదని మధుర్ విమర్శించారు.

Related posts

Ram Gopal Varma releases teaser of Dawood Ibrahim biopic D Company

cinemarascals

Film Academy invites these 819 Members to join Part-2

cinemarascals

బిగ్ బాస్ ఇంటి దయ్యం జలజ ఈవిడేనా ???

cinemarascals

Leave a Comment