ట్వీట్ చేసిన బన్నీ – అల్లు అర్జున్‌ కోసం విజయ్ కొత్త అవతారం…

  ట్వీట్ చేసిన బన్నీ – అల్లు అర్జున్‌ కోసం విజయ్ కొత్త అవతారం… 


అల్లు అర్జున్‌ కోసం విజయ్ కొత్త అవతారం... ట్వీట్ చేసిన బన్నీ..

విజయ్ దేవరకొండ అదిరిపోయే గిఫ్ట్‌తో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ఫిదా అయ్యారు. విజయ్ పంపిన ఆ గిఫ్ట్‌ను బన్నీ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. విషయం ఏమంటే.. విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ అనే పేరుతో బట్టల వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. 
ఆ రౌడీ బ్రాండ్‌కి సంబంధించిన స్పెషల్లీ డిజైనెడ్ క్లోత్స్‌ను విజయ్, బన్నీకి బహుమతిగా పంపించాడు. అంతేకాదు ఓ లెటర్ రాసిన విజయ్.. బన్నీ అన్న ఈ బట్టలు స్పెషల్‌గా నేను డిజైన్ చేశానని పేర్కోన్నాడు. ఆ బట్టల్నీ అందుకున్న బన్నీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ‘చెప్పిన విధంగా బట్టల్నీ పంపినందుకు ధన్యవాదాలు మై డియర్ బ్రదర్ విజయ్.. రేపు అల వైకుంఠపురంలో విజయోత్సవ వేడుకల్లో ప్రేమతో పంపిన ఈ బట్టల్నే ధరిస్తాను’ అంటూ ట్వీట్ చేశాడు బన్నీ. 
Image
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడవ చిత్రం ‘అల వైకుంఠపురంలో‘ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతోంది. అల్లు అర్జున్‌కు జోడిగా పూజా హెగ్డే నటించగా.. టబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యమైన పాత్రల్లో సుశాంత్, నివేదా పేతురాజ్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

షాకవుతున్న ఫ్యాన్స్ - నిధి అగర్వాల్ అలా అనేసిందేంటి...

Sun Jan 12 , 2020
షాకవుతున్న ఫ్యాన్స్ – నిధి అగర్వాల్ అలా అనేసిందేంటి…  ఇప్పుడిప్పుడే స్టార్ డమ్ తెచ్చుకుంటున్న నిధి అగర్వాల్ మాత్రం… ముందూ వెనకా ఆలోచించకుండా డైలాగ్స్ పేల్చేస్తోంది. టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన హీరోయిన్లు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.. హిందీ సినిమా ‘మున్నామైఖెల్‌’తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ హైదరాబాదీ పోరీ. బెంగళూరులో పెరిగిన ఈ భామ… మోడల్‌గా, డాన్సర్‌గా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: