తనే ఫస్ట్ లిప్ కిస్ పెట్టిందట

లిప్ కిస్సులు బాలీవుడ్ సినిమాల్లో ఎన్నో యేళ్ల నుంచి ఉన్నాయి. ముఖ్యంగా 90 వ దశకంలో అయితే ఈ కిస్సులు పతాక స్థాయికి వెళ్లాయి. అప్పటి యంగ్ హీరోలు, యంగ్ హీరోయిన్లు లిప్ కిస్ లతో జనాలను అలరించడం ఎక్కువైంది. హిందీ సినిమాల్లో ఏ హీరో లు, హీరోయిన్ లు లిప్ కిస్ లు పెట్టుకున్నా బాలీవుడ్ బాద్షాకు మాత్రం ఏ సినిమాలో కూడా హీరోయిన్ తో అధర చుంబనం జరగలేదు. కానీ సినిమా అనేది వ్యాపారం కాబట్టి ప్రేక్షకుల కోసమే లేక ఆ సినిమా దర్శకుడు, కథ డిమాండ్ చెస్తేనో ఒక్కోసారి తప్పదు. మన షారూక్ తన తొలి లిప్ కిస్ పెట్టిన హీరోయిన్ మాత్రం కత్రీనా కైఫ్.
ఎక్స్ట్రా రొమాన్స్ లిప్ కిస్ వంటి జోలికి పోకుండా బండి ఎంత లాక్కొచ్చినా జబ్ తక్ హై జాన్ అనే సినిమాలో యష్  చోప్రా అనే  సీనియర్ దర్శకుడు షారూక్ తో లిప్ కిస్ పెట్టించాడు. దాంతో బాలీవుడ్ లో లిప్ కిస్ లకు బాద్షా కూడా అతీతుడేం కాదు అని తేలిపోయింది.
ఇప్పుడు షారూక్, కత్రినా మళ్లీ జీరో అనే  సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లో నే కత్రినాకైఫ్ షారుక్ ఖాన్ కి కిస్ పెట్టిన షాట్ వదిలారు. ఇక  ఇలాంటి నేపథ్యంలో షారుక్ ఖాన్ తో తన పాత ముద్దు అనుభవాల గురించి  కత్రినాని అడిగింది మీడియా. బాలీవుడ్ లో కింగ్ ఖాన్ ని తెర మీద తొలిసారి షారూక్ ను ముద్దు పెట్టుకున్న హీరోయిన్ నువ్వే కదా.. దీనిని నీ అదృష్టంగా ఫీల్ అవుతున్నావా  అని కత్రినాను అడిగింది మీడియా అంతే వేరే వేరే హీరోయిన్లు అయితే లేని సింగారాలు పోతూ అవును నిజంగా అది ఒక మరిచిపోలేని జ్ఞాపకం అనో ఇంకొకటో చెప్పేవారు కానీ కత్రినాకైఫ్ ఏమో పెద్ద ఫైర్ బ్రాండ్ ఆయే… పైగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తోనే పెద్ద పెద్ద గొడవలు పెట్టుకున్న బాపతాయే ఊరుకుంటుందా… అదేం లేదు అదృష్టం నాది కాదు షారుక్ ఖాన్ దే అనేసింది దాంతో 
షాకవడం అక్కడున్న మీడియా వంతైంది. ఏమైనా కత్రినాకైఫ్ కత్తి లాంటి అమ్మాయి కదా.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ఆ సినిమాకు టైటిలే కష్టంగా మారింది

Thu Dec 13 , 2018
యూత్ ఫుల్ హీరో శర్వానంద్ మాంచి డిఫరెంట్ సినిమాలు తీస్తాడనే పేరున్న దర్శకుడు  సుధీర్ వర్మ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న కొత్త  సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా లో శర్వానంద్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని ఒక సామాన్య యువకుడు ఒక పెద్ద మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడు అనేది చిత్ర […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: