తమిళ్ అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా ఆదిత్య వర్మ ఫస్ట్ లుక్

తమిళ్ అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా ఆదిత్య వర్మ ఫస్ట్ లుక్

అర్జున్ రెడ్డి తెలుగు లో విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.  ఈ ఒక్క సినిమాతోనే విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రి ఓనర్ స్టార్ అయిపోయాడు ఈ సినిమాను అటు హిందీ లో హీరో షాహిద్ కపూర్ తో అర్జున్ రెడ్డి తీసిన దర్శకుడు సందీప్ వంగ నే రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాని తమిళంలో మాత్రం ప్రముఖ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ తో రీమేక్ చేయాలని దర్శకుడు బాలా తో సినిమాను స్టార్ట్ చేశారు షూటింగ్ అంతా పూర్తి చేశారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు, ఒరిజినల్ తో కంపేర్ చేసుకుంటే ఈ రీమేక్లో క్వాలిటీ కనిపించలేదని సదరు సినిమా నిర్మాతలు దర్శకుడు బాలా నీ సినిమా నుంచి తొలగిస్తున్నట్లు గా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.  సినిమాని మళ్ళీ పూర్తిగా తిరిగి షూట్ చేస్తామని దానికి సంబంధించి వేరే డైరెక్టర్ ను , హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేస్తామని చెప్పారు. దర్శకుడు బాలా తాను ముందుగానే ఈ సినిమాకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నానని అందుకే తానే మర్యాదపూర్వకంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని ఆ తర్వాత అను పర్సనల్ గా రిలీజ్ చేసిన అధికారిక ప్రకటన లో తెలిపారు. ఆ తర్వాత ఈ సినిమా కోసం చాలా మంది దర్శకుల పేర్లు కూడా వినిపించాయి కానీ చివరికి తెలుగులో అర్జున్ రెడ్డి తీసిన సందీప్ వంగ దగ్గర పనిచేసిన గిరిషయ్య అనే దర్శకుడిని ఫిక్స్ చేశారు.  అర్జున్ రెడ్డి కి  పని చేసిన అతను అయితేనే ఈ సినిమాకి న్యాయం చేస్తాడు అని భావించారు ఏమో మరి సదరు సినిమా నిర్మాతలు మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజు ఈ సినిమాకి సంబంధించిన మరో ఫస్ట్ లుక్ ను రిలీజ్ కూడా చేశారు ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ అక్టోబర్ అనే సినిమాతో పరిచయమైన బానిత సంధు తమిళ్ ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుంది.  తమిళ్ రీమేక్ సినిమా పేరు ఇంతకు ముందు వర్మ గా ఉండగా ఇప్పుడు దాని పేరు ఆదిత్య వర్మ గా కూడా మార్చారు.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

Tik tok Funny Video

Wed Feb 20 , 2019
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: