తమిళ్ హీరో విజయ్ సినిమా షూటింగ్ లో ప్రమాదం


ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శత్వంలో ఫుట్ బాల్ క్రీడా నేపథ్యంలో సాగే చిత్రంలో నటిస్తున్నాడు. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనిఉన్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. క్రీడా నేపథ్యంలో దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెర్సల్, తేరి చిత్రాలని మించేలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర షూటింగ్ లో అపశృతి చోటు చేసుకుంది..

బలమైన గాయం ఎలెక్ట్రీషియన్ సెల్వరాజ్ తలపై ఆ లైట్ పడ్డట్లు తెలుస్తోంది. సెల్వరాజ్ తలకు బలమైన గాయం అయ్యిందట. దీనితో అతడిని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సెల్వరాజ్ కు చికిత్స జరుగుతోంది. ఇటీవల విజయ్ స్వయంగాఆ ఆసుపత్రికి వెళ్లి సెల్వరాజ్ ని పరామర్శించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

క్లైమాక్స్ సీన్స్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ చెన్నైలోని ఈవిపి ఫిలిం సిటిలో క్లైమాక్స్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ లో ఊహించని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కోసం 100 అడుగుల ఎత్తులో క్రేన్ సాయంతో ఓ లైట్ ని అమర్చారట. ఆ లైట్ ని సరిగా అమర్చకపోవడంతో తెగి పడ్డట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సెల్వరాజ్ అనే వ్యక్తి గాయపడ్డట్లు తెలుస్తోంది.

                      

దీపావళి కానుకగా దళపతి 63 చిత్రంలో విజయ్ ఫుట్ బాల్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు. క్రీడా రంగంలో జరుగుతున్న రాజకీయాలు, అవినీతి గురించి అట్లీ ఈ చిత్రంలో ప్రస్తావించబోతున్నాడు. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇటీవల కాలంలో విజయ్ కు పరాజయమే లేదు. తేరి, మెర్సల్, సర్కార్ ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.
విజయ్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి సెల్వరాజ్ ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులతో ఆరా తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దళపతి 63 చిత్రంలో షారుఖ్ ఖాన్ నటించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తేలాల్సి ఉంది. ఆ మధ్యన చెన్నై, కోల్ కతా ఐపీఎల్ మ్యాచ్ సంధర్భంగా షారుఖ్ ఖాన్ ని అట్లీ కలుసుకున్నారు. అప్పటి నుంచి ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

జూ ఎన్టీఆర్ చేతికి గాయం-RRR MOVIE UPDATE

Sun Apr 28 , 2019
పవర్ స్టార్ మెగా రామ్ చరణ్  గాయం కావడంతో గుజరాత్‌ షెడ్యూల్‌ను అర్ధాంతరంగా వాయిదా వేశారు. తాజాగా హైదరాబాద్‌లో షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ షూటింగ్‌కు ఎన్టీఆర్ చేతికి కట్టుతో రావడం కనిపించింది. దాంతో షూటింగ్‌లో గాయపడ్డారనే వార్త ఫ్యాన్స్‌లో ఆందోళనకు కారణమైంది. బాహుబలి తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన RRR  చిత్రానికి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగానే ఎదురువుతున్నాయి. షూటింగ్ సరిగా జరుగుతూ అంతా సవ్యంగా సాగుతుందనే సమయంలో రాంచరణ్‌ గాయం కావడం, ఆ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: