తెలుగు సినిమా దర్శక దిగ్గజాలు పార్ట్ 2 కమలాకర కామేశ్వరరావు

తెలుగు సినిమా దర్శక దిగ్గజాలు పార్ట్ 2 కమలాకర కామేశ్వరరావు

కమలాకర కామేశ్వరరావు పౌరాణిక బ్రహ్మగా పేరుపొందిన ఈ దర్శకుడు తెలుగు సినిమా స్వర్ణయుగం అనదగ్గ సమయంలో అద్భుతమైన సినిమాలను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించారు. తెలుగు సినిమా చరిత్రలోనే అద్భుతమైన చిత్రాలు అనదగ్గ నర్తనశాల , పాండవ వనవాసం లాంటి సినిమాలను తీసిన దర్శకుడు.

జననం, సినిమా మీద ఆసక్తి :

కమలాకర కామేశ్వరరావు గారు 911 అక్టోబర్ 4న బందరు లో జన్మించారు. కామేశ్వరరావు గారి పూర్తి విద్యాభ్యాసం బందరులోనే జరిగింది 1933లో బిఏ పాస్ అయిన ఆయనకు ఆ తర్వాత సినిమాల మీద మంచి ఇంట్రెస్ట్ కలిగింది దాంతో ఆయన భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను చూడడం మొదలుపెట్టారు అయితే కమలాకర కామేశ్వరరావు గారికి సినిమా మీద ఉన్న అభిరుచి అక్కడితో ఆగిపోలేదు ఆ తర్వాత ఆయన సినిమా టెక్నిక్ కి సంబంధించిన పుస్తకాలను కూడా తెప్పించుకొని చదవడం ప్రారంభించారు. అలా సినిమాల మీద ఆయనకంటూ ఒక అవగాహన రావడంతో తాను చూసే ప్రతి సినిమా విమర్శని ఆయన రాయడం ప్రారంభించారు. అలా సినీ విమర్శకుడిగా ఆయన సినీ ప్రస్థానం మొదలైంది.

సినీ విమర్శకుడు, కొన్ని అనుభవాలు:

కామేశ్వర రావు గారు కృష్ణా పత్రిక లో సినీ ఫ్యాన్ అన్న పేరుతో సినిమా రివ్యూలు రాసే వారు. ప్రతి శుక్రవారం విడుదలైన తెలుగు సినిమాలకు ఆయన తనను అందించేవారు. అయితే ఆ సమయంలో న్యూ థియేటర్స్ ప్రభాస్ లాంటి బ్యానర్స్ లో వచ్చే హిందీ సినిమాలను కూడా నిశితంగా పరిశీలిస్తూ తన విమర్శలను రాసేవారు. కొన్ని సినిమాలు బందరులో రిలీజ్ కాకపోతే ఆయన బెజవాడ వరకు వెళ్లి ఆ సినిమాలను చూసి వచ్చి సినిమాల్లో కథా కథనాలు ఎలా ఉన్నాయి సినిమా టెక్నికల్ గా ఎలా ఉంది అన్న విషయాల మీద తన విమర్శలను రచించేవారు. కేవలం తెలుగు తమిళ్ హిందీ సినిమాలే కాకుండా అప్పట్లోనే ఆయన ఇంగ్లీష్ సినిమాల గురించి కూడా పత్రికలలో వ్యాసాలు రాసేవారు అందులో భాగంగానే గుడ్ ఎర్త్ అనే సినిమా గొప్పదనాన్ని గురించి ఆ రోజుల్లోనే 4 పత్రికల్లో ఆయన వ్యాసం రాయడం జరిగింది. కమలాకర కామేశ్వరరావు గారి సినీ విమర్శలకి ఎంతో విలువ ఉండేది ఆయన విమర్శలు మంచి సినిమాలను ప్రోత్సహించే విధంగా ఉండేది కమలాకర కామేశ్వరరావు గారి విమర్శ లో ఒక సినిమా బాగుంది అని రాస్తే ఆ సినిమాను ఎక్కువ మంది జనం చూసే వాళ్ళు అలాగే ఆయన బాగాలేదని చూసిన సినిమాకి కూడా అంతగా జనాదరణ ఉండేది కాదు. ముట్నూరి కృష్ణారావు గారు కృష్ణా పత్రిక స్థాపకుడు మరియు సంపాదకుడు అయిన ఆయన కామేశ్వరరావు గురించి ఆయనే మా సినీ ఫ్యాన్ ని నిలబెట్టిన గొప్ప మనిషి అని గర్వంగా చెప్పేవాడు. 
ఆ రోజుల్లో ద్రౌపది వస్త్రాపహరణం ద్రౌపదీ మానసంరక్షణం అనే రెండు సినిమాలు కూడా ఒకే కథ తో ఒకేసారి రిలీజ్ అయినప్పుడు కమలాకర కామేశ్వరరావు గారు ఈ రెండు చిత్రాల గురించి విమర్శలు రాస్తూ రెండిటి మధ్య తేడాలను సరిపోలుస్తూ కృష్ణాపత్రికలో వరుసగా నాలుగు వారాల పాటు ఆయన రాసిన విమర్శలు సినిమా పరిశ్రమలో ఒక సంచలనాన్ని కలిగించాయి. ద్రౌపదీ వస్త్రాపహరణం అనే సినిమా ఆర్థికంగా బాగా విజయవంతం అయింది అదే ద్రౌపదీ మానసంరక్షణం అనే సినిమా ఆర్థికంగా అంతగా విజయవంతం కాలేకపోయింది కానీ కమలాకర కామేశ్వరరావు గారు మాత్రం ద్రౌపదీ మానసంరక్షణం అనే సినిమా ద్రౌపది వస్త్రాభరణం సినిమా కంటే గొప్ప చిత్రమని ప్రశంసించాడు ద్రౌపది వస్త్రాభరణం సినిమాలో ఉన్న లోటుపాట్లను ఆయన విమర్శిస్తూనే ఆ సినిమా గొప్పతనం గురించి తన విమర్శలో రాశారు. కామేశ్వర రావు గారు రాసిన ఈ విమర్శలను నార్ల వెంకటేశ్వరరావు గూడవల్లి రామబ్రహ్మం లాంటి గొప్ప ప్రముఖులందరూ ఆ రోజుల్లోనే ప్రశంసించారు. 

సినీ రంగ ప్రవేశం:

కమలాకర కామేశ్వరరావు గారు హెచ్.ఎం.రెడ్డి కనకతార అనే సినిమా తీస్తున్న రోజుల్లో మద్రాసుకు వచ్చారు తన గురించి తన వృత్తి గురించి హెచ్.ఎం.రెడ్డి గారికి చెప్పి తనను తాను పరిచయం చేసుకుని ద్రౌపది వస్త్రాపహరణం ద్రౌపది మాన సంరక్షణ చిత్రాల మీద ఆయన రాసిన విమర్శ లను చూపించి హెచ్.ఎం.రెడ్డి మెప్పు పొందారు.  కామేశ్వరరావు గారు ముందుగా గృహలక్ష్మి అనే సినిమాకి రోహిణీ సంస్థలో పనిచేశారు అయితే అప్పటి వరకు ఆయనకు ఏ సినిమాలకు పనిచేసిన అనుభవం లేదు కాబట్టి కామేశ్వరరావుగారికి జీతం లాంటివి ఇవ్వకుండా కేవలం ఆయనకు భోజనం వసతి సౌకర్యాలను మాత్రం ఉచితంగా ఏర్పాటు చేశారు. రోహిణి సంస్థ వారి లాడ్జిలోనే వుంటే గృహలక్ష్మి సినిమాకు కామేశ్వరరావుగారు పని చేయడం జరిగింది. అయితే అక్కడ పని చేయడం వల్ల కామేశ్వర రావు గారికి బి.ఎన్.రెడ్డి కె.వి.రెడ్డి సముద్రాల రాఘవాచార్య లాంటి గొప్ప వారు పరిచయం అయ్యారు. అప్పటికే కె.వి.రెడ్డి గారు రోహిణీ సంస్థలో క్యాషియర్ గా పనిచేస్తూ ఉండేవారు. కామేశ్వరరావుగారు గృహలక్ష్మి చిత్రానికి పని చేయడం పూర్తయ్యాక బి.ఎన్.రెడ్డి రామ్నాథ్ ఎ.కె.శేఖర్ లాంటి వారు కలిసి వాహినీ సంస్థ స్థాపించారు అయితే ఆ సంస్థలో కూడా కామేశ్వరరావుగారు సహాయ దర్శకుడిగా చేరి పనిచేయడం ప్రారంభించారు. కె.వి.రెడ్డి గారు ప్రొడక్షన్ మేనేజర్గా బి.ఎన్.రెడ్డిగారు దర్శకుడిగా చేస్తూ వారు తీసిన మొదటి సినిమా దేవత ఆ సినిమాకు కామేశ్వరరావుగారు అసోసియేట్ డైరెక్టర్గా పని చేయడం జరిగింది ఆసియాలోనే అతిపెద్ద స్టూడియోగా అప్పట్లో పేరుపొందిన వాహినీ స్టూడియోకు శంకుస్థాపన జరిగినప్పుడు అక్కడుండి మట్టి వేసిన వారిలో కామేశ్వరరావు కూడా ఒకరు. బందరులోనే కామేశ్వరరావు గారికి పింగళి నాగేంద్ర రావు తో పరిచయం జరిగింది నిజంగా చెప్పాలంటే పింగళి లాంటి గొప్ప రచయితను తెలుగు సినిమా కి పరిచయం చేసింది కూడా కామేశ్వరరావు గారు అని చెప్పుకోవచ్చు. పాతాళభైరవి సినిమా కి కూడా దర్శకత్వ విభాగంలో పనిచేసిన తర్వాత కమలాకర కామేశ్వరరావు గారు చంద్రహారం అనే సినిమాతో తొలిసారిగా దర్శకుడు అయ్యారు. కానీ ఈ సినిమా విజయావారి గత సినిమాల లాగా ఆర్థికంగా విజయవంతం కాలేకపోయింది. కానీ ఈ సినిమాలో కమలాకర కామేశ్వరరావు గారు వాడిన కొన్ని టెక్నిక్స్ విదేశాల్లోని టెలివిజన్స్లో కూడా ప్రసారం అవ్వడం జరిగింది.

దర్శకత్వం వహించిన సినిమాలు :
 చంద్రహారం
 గుణసుందరి కథ
 పెంకి పెళ్ళాం
 పాండురంగ మహత్యం
 శోభ
 రేచుక్క పగటి చుక్క
 మహాకవి కాళిదాసు
 గుండమ్మ కథ
 మహామంత్రి తిమ్మరుసు
 నర్తనశాల
 పాండవ వనవాసం
 శకుంతల
 శ్రీకృష్ణతులాభారం
 శ్రీకృష్ణావతారం
 కాంభోజరాజు కథ
 వీరాంజనేయ
  కలసిన మనసులు
  మాయని మమత
  శ్రీకృష్ణ విజయం
  బాలభారతం
  శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం

దర్శకత్వం అంటే చిత్రంలోని అన్ని శాఖలు నటులు అందరూ కనిపించాలి కానీ దర్శకుడు అనేవాడు ఆ సినిమాల్లో కనిపించకూడదు అనేది తన ఉద్దేశమని కమలాకర కామేశ్వరరావు గారు ఎప్పుడు చెప్పేవారు ఇంతటి మహోన్నత ఆదర్శమూర్తి గొప్ప దర్శకుడు అయినటువంటి కమలాకర కామేశ్వరరావు గారు తన 88వ ఏట జూన్ 29న 1998 లో కన్నుమూశారు.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

సిరివెన్నెల సీతారామశాస్త్రి అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

Mon Jan 28 , 2019
సిరివెన్నెల సీతారామశాస్త్రి అభినందించిన మెగాస్టార్ చిరంజీవి https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: