దిల్ బేచారా సినిమా రివ్యూ సుశాంత్ కు సరైన నివాళి!!!!

3

దిల్ బేచారా సినిమా రివ్యూ

సుశాంత్ కు సరైన నివాళి!!!!
దిల్ బేచారా సినిమా రివ్యూ రేటింగ్:   4/5

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరగా నటించిన దిల్ బేచారా సినిమా ఈ రోజు డైరెక్ట్ గా హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ కు ముందే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ సినిమా మీద అందరికి ఒక విధమయిన ఇంట్రెస్ట్ కలిగింది దాంతో ఆయన ఫాన్స్ కోసం సినీ ప్రేక్షకులకోసం ఈ సినిమాను హాట్ స్టార్ లో అందరికీ ఫ్రీ గానే చూడడానికి అవకాశం కల్పిస్తూ రిలీజ్ చేసారు.

కథ :  కిజీ బాసు (సంజన సంఘి) క్యాన్సర్ తో బాధ పడుతుంటుంది రోజులు లెక్క బెడుతూ తను చనిపోతే తన అమ్మా నాన్న ఎలా బతుకుతారు అన్న బాధలో జీవితంలో ఎలాంటి సంతోషం లేకుండా ఉంటుంది. తనకు అభిమన్యు వీర్ సంగీతం ఒక్కటే రీలీఫ్ ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం అతను ఒక పాటను కంప్లీట్ చేయకుండా వదిలేసి ఉంటాడు కీజికి ఆ పాటంటే చాలా ఇష్టం తను ఆ పాటను రోజు వింటూ తన లైఫ్ గురించ ఒక బ్లాగ్ రాస్తుంటుంది తను ఎప్పటికైనా అభిమన్యు వీర్ ను కలిసి ఆ పాట ఎందుకు కంప్లీట్ చేయలేదో అడిగి ఆ పాటను కంప్లీట్ చేయించాలని అనుకుంటుంది. అయితే ఒక సారి కాలేజీ లో అనుకోకుండా ఇమ్మాన్యుయల్ రాజ్ కుమార్ ఆక మ్యానీ(సుశాంత్ సింగ్ రాజ్ పుత్) ని కలుస్తుంది, ఎప్పుడూ నవ్వుతూ అల్లరి చేస్తూ ఉండే మ్యానీ తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది, అప్పటి వరకు బాధలో వున్న కిజీ బాసుకి కొత్త లోకాన్ని పరిచయం చేస్తాడు కానీ ఒకరోజు మానీ కి కూడా క్యాన్సర్  తనకు కాలు లేదని తెలుస్తుంది. అలాగే తన ఫ్రెండ్ JP కు కూడా క్యాన్సర్ ఉంటుంది,  కానీ ఆ ఫ్రెండ్ చనిపోయేలోపు ఒక సినిమా తీయాలనుకుంటాడు దానికి సుశాంత్ హీరోయిన్ ను ఒప్పించి తామిద్దరూ హీరో,హీరోయిన్స్ అని షూటింగ్ చేస్తాడు. ఈలోపు ఫ్రెండ్ కు ఆపరేషన్ జరిగి అతని కంటి చూపు మొత్తం పోతుంది, అదే టైంకు కీజి కి హెల్త్ సీరియస్ అవుతుంది. మరి ఆ సినిమాను మ్యానీ, కిజీ బాసు కంప్లీట్ చేసారా? అభిమన్యు వీర్ పారిస్ లో ఉన్నాడని తెలుసుకున్న కీజి బాసు అతన్ని కలిసిందా? ఆ సాంగ్ ఎందుకు కంప్లీట్ చేయలేదో తెలుసుకుందా?  ఆ తర్వాత ఏమైంది అన్నదే మిగాత కథ.

విశ్లేషణ :
ఇదొక హార్ట్ టచింగ్ సినిమా… హీరో, హీరోయిన్ ఇద్దరికీ క్యాన్సర్ ఉండి వాళ్ళు చనిపోయే లోపు జరిగే ప్రేమ కథ ఇది, ఇలాంటిదే తెలుగులో నాగార్జున గీతాంజలి వచ్చింది కానీ దానికి దీనికి చిన్న తేడా ఉంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన చివరి సినిమాలో చనిపోయే పాత్ర చేయడం అతను నిజంగానే చనిపోవడం! సినిమా చూస్తున్నప్పుడు ఆయన అభిమానులకు చాలా బాధ కలిగించే విషయమే. సినిమాలో సుశాంత్ నటన చాలా బాగుంది అతని పాత్ర పరిచయం, తర్వాత సీన్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి అయితే ఆ తర్వాత తనకు కాలు లేదని చూపించాక కూడా దాదాపు క్లైమాక్స్ వరకు సుశాంత్ పాత్రను ఎంటర్టైన్మెంట్ గానే తీసుకెళ్లడం పెద్ద రీలీఫ్ ఎందుకంటె చూసేది సినిమా అయినా సుశాంత్ రియల్ లైఫ్ లో కూడా చనిపోయాడు అన్న బాధ మనల్ని తొలిచేస్తూ ఉంటుంది. రజని కాంత్ ఫ్యాన్ గా తానూ కూడా రజనీ సర్ లా అవ్వాలని సుశాంత్ చెప్పే డైలాగ్స్ నవ్వు తెప్పిస్తాయి. ఇక కొత్త అమ్మాయి సంజన సంఘి తన పాత్రలో అద్భుతంగా నటించింది సినిమా అంతా తన వాయిస్ ఓవర్ తోనే ఉంటుంది తన లైఫ్ గురించి బాధ పడుతూ మ్యానీ కలిసాక తనలో ఆనందం రావడం మ్యానీకి కూడా కాన్సర్ ఉందని తెలిసాక ఆవిడ నటన, చివరలో తన ముందే మ్యానీ చనిపోతుంటే తను పడే వేదన అన్నిటిని బాగా చేసింది. ఇక పోతే సుశాంత్ ఫ్రెండ్ JP గా చేసిన సాహిల్ వైద్ తన పాత్రలో ఆకట్టుకున్నాడు. సంజన సంఘి పేరెంట్స్ గా చేసిన బెంగాలీ నటులు స్వస్తికా ముఖర్జీ, స్వస్త చటర్జీలు ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేసారు. ఒక ప్రత్యెక పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటన డీసెంట్ గా ఉంది.  డైరెక్టర్ గా తొలి సినిమా అయినప్పటికీ ముఖేష్ చాబ్ర ఈ సినిమాను హార్ట్ టచింగ్ గా, అందంగా తెరకెక్కించాడు, విజువల్స్ చాలా బాగున్నాయి. ఇకపోతే రెహమాన్ తన మ్యూజిక్ తో మేజిక్ చేసాడు ప్రతీ పాట కథలో బాగం అయ్యి బాగా కుదిరాయి, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

సుశాంత్ స్పెషల్ సీన్స్ అభిమానుల కంట తడి :  

ఒక నటుడు తన సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుని ఆ తర్వాత సినిమాల్లోంచి రిటైర్ అయ్యో లేదా ఓల్డ్ ఏజ్ కు చేరుకునే మరణిస్తాడు అతను మరణించినా అతను తన సినిమాల ద్వారా అభిమానుల గుండెల్లో బ్రతికే ఉంటాడు. అయితే ఈ సినిమాకు వచ్చే సరికి సుశాంత్ అభిమానులకు అలాగే సాధారణ సినీ ప్రేక్షకులకు ఈ సినిమా చూస్తున్నoతసేపు గుండెల్లో కలుక్కుమంటుంది. ఇంత టాలెంట్ ఉన్న నటుడు ఎందుకలా సూసైడ్ చేసుకున్నాడు అన్న బాధ సినిమా చివరలో సుశాంత్ చనిపోయినప్పుడు ఇంకా ఎక్కువవుతుంది. ఇకపోతే సినిమాలో సుశాంత్ కు ఉన్న కొన్ని సీన్స్ మనల్ని ఇంకా బాధ పెడతాయి అవి…
1.       మొదటి సారి సుశాంత్ తనకు కూడా కాన్సర్ కాలు తీసేశారు అని చూపించినప్పుడు…

2.       సుశాంత్ హీరోయిన్ తండ్రితో వర్షంలో మాట్లాడుతూ “నాకు కూడా చాలా పెద్ద కలలున్నాయి కానీ వాటిని నేను సాధించడానికి ట్రై చేయలేదు అని చెప్పినప్పుడు.

3.  సుశాంత్ కు హీరోయిన్ ఐ లవ్ యు చెప్పినపుడు సుశాంత్ హీరోయిన్ కంటే ముందే తను చనిపోతున్నాడు అని రివీల్ చేసినప్పుడు.

4.       సుశాoత్  చర్చి లో తను ఆల్రెడీ చనిపోయానని ఇది తన ఫ్యూనరల్ ఇప్పుడు తన గురించి మాట్లాడమని తన ఫ్రెండ్, హీరోయిన్ ని అడిగినప్పుడు. ఈ సీన్ లో తను చనిపోయే ఎక్కడికీ వెళ్లనని ఈ చర్చిలోనే ఓ దగ్గర కూర్చుంటానని అంటాడు.

5.       చర్చి లో సినిమాలో సుశాంత్ ఫ్రెండ్ సుశాంత్ గురించి మాట్లాడుతూ అప్పుడే ఎందుకు చనిపోతావ్ ఏ ఒక సంవత్సరం ఆగలేవా అంటాడు అప్పుడు.

6.       చివరలో రజనీకాంత్ సినిమా చూస్తూ సుశాంత్ యాక్టింగ్,  తనని సినిమా ధియేటర్ నుంచి హాస్పిటల్ కు తీసుకెళ్లడం.

7.  క్లైమాక్స్ సీన్ లో సుశాంత్ సమాధి దగ్గర హీరోయిన్ ఫ్లవర్స్ పెట్టి తను చివరగా రాసిన లెటర్ చదువుతుంది. దాంట్లో సుశాంత్ రాజా రాణి కథలో రాజా చనిపోయినా రాణి బతాకలి అని చెపుతాడు.

8.       సినిమాలో సుశాంత్ ఫ్రెండ్ తీయాలనుకున్న సినిమాను సుశాంత్, హీరోయిన్ కంప్లీట్ చేసాక దాన్ని ఒక పార్టీలో స్క్రీన్నింగ్ చేయడం ఆ సినిమాలో సుశాంత్ సీన్స్ చూస్తూ అందరూ కంటతడి పెట్టుకోవడం.   
చివరగా  :
సినిమాలో సుశాంత్ పాత్ర లెటర్ లో రాసినట్టు పుట్టడం, చావడం మన చేతుల్లో లేదు కానీ మధ్యలో ఉన్న లైఫ్ మాత్రం ఎలా బ్రతకాలో మన చేతుల్లోనే ఉంది ఆ ఒక్క విషయాన్ని ఎవరైనా బాగా గుర్తుపెట్టుకోవాలి. 


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

3 thoughts on “దిల్ బేచారా సినిమా రివ్యూ సుశాంత్ కు సరైన నివాళి!!!!

Leave a Reply

Next Post

ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య రివ్యూ మనసుల్ని తట్టిలేపే క్లాసిక్!!!

Thu Jul 30 , 2020
ఉమా మహేశ్వర ఉగ్ర  రూపస్య రివ్యూ మనసుల్ని తట్టిలేపే క్లాసిక్!!! ఉమా మహేశ్వర ఉగ్ర  రూపస్య రివ్యూ రేటింగ్ :  4/5 కరోనా కారణంగా మరో తెలుగు సినిమా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. మలయాళ సినిమా ‘మహిషింతే ప్రతీకారం’ అనే సినిమాకు ఆఫిషియల్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. మలయాళం సినిమాలో లైఫ్ ఉంటుంది అక్కడి పరిస్థితులు, […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: