దిల్ రాజు….ప్లాన్

దిల్ రాజు…. ప్లాన్ 

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం మహర్షి. సూపర్ స్టార్ మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందించిన ఈ సినిమా ఫస్ట్ డే 25 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతానికి దాదాపు 50 కోట్లు షేర్ సాధించింది. ఈ సినిమాకి సినీ పండితుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఎందుకంటే.. ఈ సినిమా చూస్తుంటే… మహేష్ గత చిత్రాలు ఒక్కొక్కటి అలా కళ్ల ముందుకు వస్తుంటాయి. అందుచేత ఇందులో కొత్తగా ఏం లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది.

అయితే.. రైతులకు గౌరవం ఇవ్వాలి అని చెప్పడం… వీకెండ్‌లో వ్యవసాయం చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో ప్రేక్షకులకు ఈ సినిమాని చూడచ్చు అనే ఫీలింగ్ కలిగించారు. నిడివి మూడు గంటలు. సినిమా బాగుందా లేదా అనేదాని కన్నా నిడివి గురించి ఎక్కువ కామెంట్స్ వచ్చాయి. వీటన్నింటిని మరచిపోయేలా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టేలా దిల్ రాజు వరుసగా సక్సస్‌మీట్‌లు ఏర్పాటు చేస్తూ ఆడియన్స్‌కి ఈ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు.
ఈ నెల 18న విజయవాడలో మహర్షి భారీ సక్సస్‌మీట్ ఏర్పాటు చేసారు. ఇందులో మహేష్ బాబుతో కలిసి వర్క్ చేసిన 25 సినిమాల దర్శకులు పాల్గొంటారు. ఆ తర్వాత రైతులతో మహేష్‌, వంశీ పైడిపల్లి ప్రత్యేక సమావేశాన్ని దిల్ రాజు ఏర్పాటు చేసారట. ఈ విధంగా ఏదో రకంగా మహర్షి చిత్రాన్ని వార్తల్లో ఉంచుతూ బ్లాక్‌బష్టర్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు దిల్ రాజు.
థియేట్రికల్ రైట్స్‌ని దాదాపుగా 100 కోట్లకు అమ్మారు. 50 కోట్లు వచ్చాయి ఇంకా 50 కోట్లు రావాలి. ఇప్పట్లో పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి దిల్ రాజు ప్లాన్ వర్కవుటయి మహర్షి అంచనాలను అందుకుని ఘన విజయం సాధిస్తుందనిపిస్తుంది. మరి… ఫుల్ రన్‌లో మహర్షి ఎంత కలెక్ట్ చేస్తాడో..?
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

కైరా అడ్వాణీకి ఏం అయింది ...ఆ బుగ్గల పై ??

Tue May 14 , 2019
కైరా అడ్వాణీకి ఏం అయింది …ఆ బుగ్గల పై  కైరా అడ్వాణీ రూమర్లు  ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కియారా అద్వానీ ముఖంపై రెండు మచ్చలు కనిపించడం, ముఖం వాచిపోయి ఉండటంతో రకరకాల ఊహాగానాలకు చోటిచ్చింది. ప్లాస్టిక్ సర్జరీ వికటించిందని కొందరు రూమర్లను వార్తలుగా మలిచారు. తనపై వస్తున్న రూమర్లకు ఆమె సమాధానం ఇచ్చింది. ఎంఎస్ ధోని బయోపిక్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కియారా అద్వానీ అటు గ్లామర్ పరంగాను, నటనపరంగాను అందర్ని […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: