ధనుష్ సినిమాకు దిమ్మ తిరిగే రేట్!!!!

ధనుష్ సినిమాకు దిమ్మ తిరిగే రేట్!!!!

రజనీ కాంత్ అల్లుడు తమిళ్  హీరో ధనుష్  కోలీవుడ్ లో ఇతడు పెద్ద హీరోనే. రజనీకాంత్ అల్లుడిగా, స్టార్ హీరోగా అతడికి తిరుగు లేని ఇమేజ్ ఉంది. కానీ అదే ఇమేజ్ టాలీవుడ్ లో కూడా ఉందని భ్రమించడంతోనే ఇబ్బంది వస్తోంది. తెలుగులో కూడా తనకు తిరుగులేదు అనే విధంగా ప్రవర్తిస్తున్నాడు ధనుష్. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ధనుష్ లేటెస్ట్ సినిమా మారి 2 సినిమాకు ధనుష్ తెలుగు డబ్బింగ్ రైట్స్ గురించి జరిగిన ఇష్యూ వల్లనే.

తెలుగులో ధనుష్ సినిమాలన్నీ డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయినవి… కానీ వాటన్నింటిలో రఘువరన్ బీటెక్ అనే ఒకేఒక్క సినిమా ఇక్కడ కూడా బాగానే ఆడింది. అయితే ఆ ఒక్క సినిమా ఇక్కడ ఆడినంత మాత్రాన మిగతా అన్ని సినిమాలు ఆడేస్తాయనే భ్రమలో ఉన్నాడు ధనుష్. ఒక వేళ ధనుష్ అనుకున్నదే నిజమయితే తెలుగులో తనకంటే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన విజయ్ ఆంటోనీ ఏమనుకోవాలి. కేవలం బిచ్చగాడు అనే సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ్ ఆంటోనీ ఇక్కడ సూపర్ స్టార్ అయిపోవాలి మరి. ఈ చిన్న లాజిక్ కు ధనుష్ ఎందుకు ఎలా  మిస్ అవుతున్నాడు.

ఇప్పుడు మనం డైరెక్టుగా మ్యాటర్ లోకి వస్తే అసలు విషయం ఏంటంటే తమిళ్ లో మారి -2 అనే సినిమా చేశాడు ఈ హీరో కమ్ నిర్మాత. తమిళ్ లో ఈ సినిమాకు మాంచి బజ్ ఉంది అయితే దీన్ని తెలుగులో కూడా రిలీజ్ చేద్దాం అని కొంత మంది బయ్యర్లు రెడి గా ఉన్నది నిజం. కానీ దీన్ని సాకుగా చూపెడుతూ ధనుష్ నా సినిమా కోసం బయ్యర్లు తెగ ఎదురుస్తున్నారనే రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నాడు. ఆకాశాన్నంటే రేట్లు చెబుతున్నాడు. చివరికి ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ కు కూడా ఇతడు అమాంతం 5 కోట్ల రూపాయలు చెప్పడం విశేషం.

గతంలో కాలా సినిమా టైమ్ లో కూడా ఇలానే ప్రవర్తించాడు ధనుష్. రజనీకాంత్ ను హీరోగా పెట్టి, సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు భారీ రేట్లు చెప్పాడు. కట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇంత పెద్ద అనుభవం చవిచూసిన తర్వాత కూడా మారి-2 కోసం భారీ రేట్లు చెబుతున్నాడు.

నిజానికి తెలుగులో ధనుష్ కు అంత సీన్ లేదు. రజనీకాంత్ తర్వాత కోలీవుడ్ నుంచి విశాల్, కమల్, సూర్య, కార్తి లాంటి హీరోలకు మాత్రమే కొద్దిగా మార్కెట్ ఉంది. ఇప్పుడిప్పుడే విజయ్ కూడా ఎంటరయ్యాడు. ఈ లిస్ట్ లో ధనుష్ ఇంకా చేరలేదు.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ఆ సినిమాలో అంత మంది స్టార్సా ?

Thu Dec 20 , 2018
ఆ సినిమాలో అంత మంది స్టార్సా ? విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ సినిమా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ తీస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ప్రప్రథమంగా ఒక తండ్రి బయోపిక్ని కొడుకు తీస్తుండడం చాలా పెద్ద విశేషం. తన తండ్రి పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ ఈ సినిమాల్లో సుమారుగా 36 పాత్రల్ని చేస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు అని రెండు పార్ట్లు గా రాబోతున్న ఈ సినిమా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: