నరేంద్ర మోడీ బయోపిక్ ఫస్ట్ లుక్

నరేంద్ర మోడీ బయోపిక్ ఫస్ట్ లుక్

భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ ను హిందీ లో సినిమాగా తీస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ బయోపిక్ లో నరేంద్ర మోడీ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. నటుడు వివేక్ ఒబెరాయ్ అచ్చంగా మోడీ లాగానే ఉన్న గెటప్ తో ఈ పోస్టర్ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో అద్భుతమైన రీతిలో ప్రజాదరణ పొంది గొప్ప పొలిటికల్ నాయకుడిగా పేరు తెచ్చుకొని రెండు సార్లు భారత ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన నరేంద్ర మోడీ బయోపిక్ అంటే సాధారణ ప్రేక్షకుల్లో కచ్చితంగా మంచి అంచనాలే ఉంటాయి. అయితే ఈ సినిమాను ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలో ఉన్న ఇరవై మూడు భాషల్లో దీనిని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్ సినిమాలు చాలా ఎక్కువగానే వస్తున్నాయి. ధోని, సంజయ్ దత్, మేరీ కోమ్, హైదరాబాద్ క్రికెటర్ అజారుద్దీన్ ఇప్పుడు కొత్తగా సైనా నెహ్వాల్,  పుల్లెల గోపీచంద్ పీవీ సింధు బయోపిక్  దాంతోపాటు 1983 వరల్డ్ కప్ హీరో ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్  బయోపిక్ ఇలా బయోపిక్ సినిమాలు చాలా ఎక్కువగానే వస్తున్నాయి.
అయితే ఇప్పుడు వస్తున్న నరేంద్ర మోడీ బయోపిక్ మీద అన్నిటికంటే మించి అంచనాలు ఉన్నాయి. ఒక పొలిటికల్ లీడర్ గా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రిగా అందరికీ సుపరిచితమైన నరేంద్ర మోడీ పర్సనల్ జీవితం ఎలా ఉంది ఆయన ఏలాంటి కష్టాలను ఎదుర్కొని తన జీవితంలోఇంత గొప్ప స్థాయికి వచ్చారు అన్న విషయాలు తెలుసుకోవాలని సాధారణ భారత పౌరుడికి చాలా కుతూహలం గా ఉంటుంది. నరేంద్ర మోడీ బాల్యం యవ్వనం, ఆయన చదువు, రాజకీయ ప్రవేశం ఆర్ఎస్ఎస్ తో ఆయనకు ఉన్న అనుబంధం ఇలా నరేంద్ర మోడి జీవితం గురించిన విషయాలతో పాటు ఆయన పొలిటికల్ కెరీర్ లో ఒక మాయని మచ్చ గా మిగిలిపోయిన గోద్రా అల్లర్ల గురించి కూడా ఈ సినిమాలో చూపిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

యాత్ర మూవీ ట్రైలర్

Mon Jan 7 , 2019
యాత్ర మూవీ ట్రైలర్ https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: