నరేంద్ర మోడీ బయోపిక్ వస్తుంది!!

నరేంద్ర మోడీ బయోపిక్ వస్తుంది!!
ఇప్పుడంతా బయోపిక్ ల కాలం నడుస్తోంది.  అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా బయోపిక్ లే బయోపిక్ లు. బాలీవుడ్ లో మొన్న ఎమ్మెస్ ధోనీ బయోపిక్, మేరీ కోమ్ బయోపిక్, ఇప్పుడేమో కొత్తగా శివసేన అధ్యక్షుడు బాల్ థాకరే బయోపిక్ మరోవైపు  ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ ఇంకోవైపు బ్యాట్మెంటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ ఇక ముందు కూడా పుల్లెల గోపీచంద్ బయోపిక్  పివి సింధు బయోపిక్ ఇలా బయోపిక్ లు సినిమాలు బోలెడు రానున్నాయి. ఇక ఇటు టాలీవుడ్ లో తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నటుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ ని ఆయన కుమారుడు ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు గా రెండు పార్టులుగా తీస్తున్నారు. దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బయో పిక్ ని మమ్ముట్టితో దర్శకుడు  మహి వి రాఘవ్ యాత్ర పేరుతో రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ బయోపిక్ సినిమాల్లోకి కొత్తగా వచ్చి చేరిన బయోపిక్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీది. ఒక చాయ్ వాలా దగ్గర నుంచి తన జీవితాన్ని ప్రారంభించిన నరేంద్రమోడీ ఎలా అంచెలంచెలుగా ఎదిగి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ తర్వాత భారత దేశ ప్రధానమంత్రిగా తన జీవితంలో గొప్ప స్థానానికి చేరుకున్నారు అనే విషయాలన్నింటినీ నరేంద్రమోడీ బయోపిక్ లో చూపించబోతున్నారట.

నరేంద్ర మోడీ 2009 ఎలక్షన్స్ వరకు భారతదేశంలో అంతగా ఎవరికీ తెలియని పేరు ఇండియా కూటమి తరపునప్రధానమంత్రి అభ్యర్థిగా మొట్టమొదటిసారి ఆయన పేరు తెర మీదకు  వచ్చినప్పుడు దేశం మొత్తం ఆయన వైపు చూసింది. బిజెపిలాంటి ఒక జాతీయ పార్టీ లో ఎందరో ఉద్ధండులు ఉండగా  బిజెపి జాతీయ నాయకత్వం నరేంద్ర మోడీ పేరును ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు పెట్టిందంటే నరేంద్ర మోడీ సత్తా ఏంటో ఆయన పవర్ ఏంటో అప్పుడు గాని ఎవరికీ తెలియలేదు. ఎల్కే అద్వానీ లాంటి సీనియర్ పవర్ ఫుల్ నేతల్ని కాదని నరేంద్ర మోడీకి ఆ బాధిత అప్పగించినందుకు ఆయన 2009 ఎలక్షన్స్ లో అద్భుతమైన మెజారిటీతో బిజెపిని గెలిపించి భారత దేశ ప్రధాన మంత్రిగా తొలిసారి ఆ పదవిని చేపట్టారు. ఆ తర్వాత ఆయన చేసిన అభివృద్ధి పనులు ప్రభుత్వ పనితీరు వల్ల తిరిగి 2014లో ను మళ్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వాక్చాతుర్యంతో తన రాజకీయ చతురతతో ప్రపంచవ్యాప్తంగా భారత్ కు ఎనలేని గుర్తింపు తెచ్చి పెట్టారు. రాజకీయంగా ఆర్థికంగా రక్షణ  పరంగా కూడా భారత్ ను ఆయన ముందుకు నడిపిస్తున్నారు. అద్భుతమైన తన నాయకత్వ లక్షణాలతో ప్రజల్ని సమ్మోహితుల్ని చేసే తన సంభాషణా చాతుర్యంతో అత్యంత కొద్ది కాలంలోనే భారత ప్రజల మనసుల మీద చెరగని ముద్ర వేసిన నరేంద్రమోడీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అలాంటి నరేంద్ర మోడీ జీవితాన్ని ఇప్పుడు బయోపిక్ సినిమాగా మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఒముంగ కుమార్ దర్శకత్వంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో నరేంద్రమోడీగాకనిపించబోతున్నారు. ఇప్పటివరకు క్రికెటర్లు సినిమా తారలు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు ఇలా వీళ్లందరి జీవిత చరిత్రని మనం బయోపిక్ సినిమాలుగా చూసాం కానీ మన భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఒక ప్రధాన మంత్రి బయోపిక్ ని ఇప్పుడు చూడబోతున్నాం. అది కూడా ప్రధానమంత్రి అధికారంలో ఉన్నప్పుడు ఆయన జీవిత చరిత్ర బయోపిక్ సినిమాగా రానుంది. ఏది ఏమైనప్పటికీ ఒక బలమైన నాయకుడిగా అద్భుతమైన పనితీరు గల ప్రధాన మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న నరేంద్ర మోడీ జీవితాన్ని బయోపిక్ సినిమా తీస్తున్నారు అంటే ఒక సామాన్య ప్రేక్షకుడి లో కచ్చితంగా ఆ సినిమాను చూడాలన్న ఉత్సాహం ఉంటుంది. అతి త్వరలోనే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ బయోపిక్ మన ముందుకు రాబోతుంది.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

అరుదైన ఫోటో!!!

Fri Jan 4 , 2019
అరుదైన ఫోటో!!!          Image credited from Twitter.com ఈ ఫోటో దాదాపు 19 వ శతాబ్దంలో కుంభకోణం మహా మహా మహం లో తీసిన ఫోటో. మీరు ఈ ఫోటోను జూమ్ చేయగలిగితే ఆ ఫోటోలో ఉన్న మనుషుల ముఖాలను చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇలాంటి ఇంకా పాత అరుదైన ఫోటోలు మీరు చూడాలి అని అనుకుంటే హైదరాబాదులో ఉన్న స్టేట్ ఆర్ట్ గ్యాలరీని […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: