నాని సినిమా లో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ

నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమా ఈ రోజు ఓపెనింగ్ జరుపుకుంది. ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ సినిమాలో 5 గురు హీరోయిన్ లు నాని సరసన నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర కు ఆర్  ఎక్స్ 100 హీరో కార్తీ కేయ ను తీసుకున్నారు. నాని కి మంచి పోటీ ఇచ్చే పాత్ర అని సినిమాలో కీలకంగా ఉంటుంది అని తెలుస్తుంది. ఈ మధ్య ఫ్లాప్ లలో ఉన్న నాని విక్రమ్ కుమార్ జతకట్టి సినిమా చేస్తున్నారు. నాని జర్శి సినిమా తర్వాత ఇది రిలీజ్ అవబోతుంది. 24, మనం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత విక్రమ్ కుమార్ నుంచి పెద్ద హిట్ సినిమాలు ఏవి రాలేదు రీసెంట్ గా అఖిల్ తో హలో సినిమా తీసినా కూడా అది బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత విజయాన్ని సొంతం చేసుకొలేక పోయింది. దాంతో కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు నాని తో జత కట్టి వస్తున్నాడు విక్రమ్ ఈసారైనా హిట్ కొడతాడా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ కొరకు వేచి చూడాలి.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

గల్లి బాయ్ రీమేక్ లో సాయి ధరమ్ తేజ్

Tue Feb 19 , 2019
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్,  హిందీ సినిమా గల్లీ బాయ్ సినిమాలో నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా హిందీలో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది రన్వీర్ సింగ్,అలియాభట్ హీరోహీరోయిన్లుగా జోయా అఖ్తర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టిస్తుంది. ర్యాప్ సింగింగ్ కథా నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది ముంబై […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: