నిఖిల్ కొత్త సినిమా టైటిల్ మారుస్తున్నారు!!

 

 

 

నిఖిల్ కొత్త సినిమా టైటిల్ మారుస్తున్నారు!!

 

 

యువ హీరో నిఖిల్ లేటెస్ట్ సినిమా ముద్ర తమిళంలో కనితన్ అనే పేరుతో వచ్చి సూపర్ హిట్ అయిన ఆ సినిమాను తెలుగులో అదే డైరెక్టర్ తో రీమేక్ చేస్తున్నారు. అయితే అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ అలా అలా  జరపుకుంటూ పూర్తి చేసుకుని ఇప్పుడు మెల్లగా విడుదల డేట్ కు వచ్చింది. మార్చిలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే సినిమాకు మొదటి నుంచీ ముద్ర అనే వర్కింగ్ టైటిల్ నే ఫైనల్ చేస్తే సరిపోతుందనే ఆలోచనలో వుంటూ వచ్చారు. కథ పరంగా చూసుకుంటే సినిమా దొంగ సర్టిఫికెట్ల గురించినది కావడంతో ముద్ర అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావించి ఆ టైటిల్ ఫిక్స్ అయ్యారు అయితే  అదే టైటిల్ ను ఎవరో చిన్న సినిమాకు రిజిస్టర్ చేసుకోవడం, వాళ్లు ఇదిగో విడుదల, అదిగో విడుదల అనడంతో సినిమా టైటిల్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది దీంతో విసిగిపోయిన నిఖిల్ సినిమా యూనిట్ కొత్త టైటిల్ కోసం అన్వేషిస్తోంది.

సినిమాలో హీరో పేరు అర్జున్ హీరో పేరు కలిసొచ్చేలా అర్జున్ సురవరం కు టైటిల్ ను అనుకున్నారు కానీ దీనికి ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఈలోపు మరికొన్ని టైటిళ్ల కోసం అన్వేషిస్తున్నారు. ఈ టైటిల్ వేటలో ప్రేక్షకులను కూడా భాగస్వాములను చేసే ఆలోచన కూడా చేస్తారట.  మా సినిమాకు టైటిల్ పెట్టండి అంటూ ఫేస్బుక్, ట్విట్టర్ లో అభిప్రాయసేకరణ చేసి అప్పుడు టైటిల్ చేస్తే అటు సినిమాకు పబ్లిసిటీ వచ్చినట్టూ ఉంటుంది ఇటు లక్కీగా ఏదైనా మంచి టైటిల్ కూడా దొరుకుతుంది అని ఆలోచించారట. లెక్క ప్రకారం మార్చిలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటికే కాస్త ఆలస్యం అయింది. ఇకనైనా చకచకా పనులు ఫినిష్ చేసి, టైటిల్ ప్రకటించుకుంటే మంచిది. ఎందుకంటే ఒక యువ యువ హీరో సినిమాలు ఎంత లేట్ అయితే ఆ హీరో కి అంతగా పబ్లిసిటీ తగ్గిపోయే ప్రమాదం ఉంది.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి

Fri Jan 18 , 2019
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ కొత్త అసెంబ్లీ కొలువుదీరే సమయం రావడంతో కొత్త శాసనసభ స్పీకర్ ఎన్నిక జరిగింది. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ని ఈసారి స్పీకర్ పదవి వరించింది. పార్టీలో చాలా సీనియర్ అవ్వడం రాష్ట్ర స్థితిగతుల మీద బాగా అవగాహన ఉండడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: