నిజంగా ఆ దర్శకుడితోనేనా – రామ్ చరణ్ తర్వాత సినిమా
ఆ నమ్మకంతోనే ఇప్పుడు చరణ్ కూడా ఈ దర్శకుడితో పని చేయాలని చూస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలాగైతే పూర్తిగా యాక్షన్ సినిమా చేసాడో.. ఇప్పుడు చరణ్ కూడా అదే చేయాలనుకుంటున్నాడు. కాకపోతే ఇక్కడ కూడా సుజీత్ ఉండటం విశేషం. పైగా సుజీత్ వర్కింగ్ స్టైల్ గురించి చరణ్‌కు ప్రభాస్ చాలా గొప్పగా చెప్పాడని.. కచ్చితంగా కాంబినేషన్ బాగుంటుంది.. ఒప్పుకో బ్రదర్ అని చరణ్‌కు సలహా కూడా ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిర్తే ఈ చిత్రంతో మరోసారి హిందీలోకి వెళ్లాలని చూస్తున్నాడు రామ్ చరణ్.
సాహో సినిమాతో ఇండియన్ వైడ్‌గా తన పేరు పాపులర్ అయ్యేలా చేసుకున్నాడు ఈ కుర్ర దర్శకుడు. 30 ఏళ్లు కూడా నిండకుండానే 200 కోట్ల బడ్జెట్ పెట్టించాడు సుజీత్. సాహో సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా కూడా హిందీలో మాత్రం హిట్ అయింది. యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా తెరకెక్కించాడు సుజీత్.
ఇందులో భాగంగానే రామ్ చరణ్ కొందరు దర్శకులు చెప్పే కథలు వింటున్నాడు. ఇప్పటికే హరీష్ శంకర్, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు చరణ్‌ను కలిసి లైన్స్ చెప్పారని తెలుస్తుంది. అయితే వీళ్లందరి కంటే కూడా రేస్‌లో సుజీత్ ముందున్నాడు.
రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావడానికి మరో ఆర్నెళ్లు అయినా కచ్చితంగా పట్టేలా కనిపిస్తుంది. అప్పటి వరకు మరో సినిమా గురించి ఆలోచించే టైమ్ చరణ్ దగ్గర లేదు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ ఇద్దరిపై వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు జక్కన్న.
ఇదిలా ఉంటే RRR సినిమా సెట్స్‌పై ఉండగానే ఇప్పుడు మరో సినిమా గురించి ఆలోచిస్తున్నాడు చరణ్. ఈయన తర్వాతి సినిమా ఏంటనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్‌ను లైన్‌లో పెట్టేసాడు. ఈయనతోనే నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు. దీనికి కళ్యాణ్ రామ్ నిర్మాత అని తెలుస్తుంది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss