పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ తో గెలి చేస్తాడా??

పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ తో గెలిచేస్తాడా?? 


జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తమ పార్టీకి ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును  కేటాయించినందుకు చాలా సంతోషంగా ఫీలవుతున్నారు. గాజు గ్లాస్ సామాన్యుడు గుర్తు అనే దానితో నాకు చిన్నప్పట్నుంచీ చాలా అనుభవాలు-జ్ఞాపకాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల సంఘం రైలింజన్ ప్రకటించినప్పుడు కూడా రైలు సామాన్యుడు గుర్తు అంటూ మాట్లాడిన విషయం మనకు తెలిసిందే. కానీ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా ఓడిపోయి కేవలం 18 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది. అయితే ఎన్నికల్లో అన్ని పార్టీల గుర్తులు చాలా ముఖ్యం గా ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి తమకు తెలిసిన గుర్తులను ప్రజలు తాము ఓటు వేసేటప్పుడు చాలా సులభంగా గుర్తు పట్టగలరు. అయితే ఒక కొత్త రాజకీయ పార్టీగా వచ్చిన జనసేన ఇన్ని సంవత్సరాలుగా ఎన్నికల సంఘానికి తమ గుర్తు కోసం ఎందుకు అభ్యర్థించ లేక పోయిందో తెలియదు. వచ్చే సంవత్సరం 2019లో ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికల కు సమయం సమీపిస్తుండటంతో అక్కడ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి ఎన్నికల వేడి మొదలైంది. ఆయా రాజకీయ పార్టీలు మెల్లగా ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలు పెడుతున్నాయి.  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  జగన్మోహన్రెడ్డి చాలా రోజుల నుంచి పాదయాత్ర పేరుతో జనాలు లోని తిరుగుతున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు తాను చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రచార మాధ్యమాల ద్వారా విపరీతంగా జనాల్లోకి  తీసుకెళ్లడానికి ఆయన వంతు కృషి చేస్తున్నారు. ఇక మిగిలిన పార్టీలైన బిజెపి సిపిఐ సిపిఎం లాంటివి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ధర్నాలు చేయడం ద్వారా ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు చాలా ముఖ్యమైనవి. గత తొమ్మిది సంవత్సరాలుగా తమకు అందని ద్రాక్షగా ఉన్న అధికారాన్ని ఈసారి ఎలాగైనా చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా కసితో ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మీద ఇప్పటికే అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులు చాలా ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి జగన్మోహన్రెడ్డి కోర్టులకు వెళ్ళడం తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తన ప్రత్యర్థి చంద్రబాబునాయుడు మళ్లీ ఈ సారి కూడా అధికారంలోకి రాగలిగితే ఇక కచ్చితంగా జగన్మోహన్రెడ్డి పొలిటికల్ కెరియర్ కి చాలా పెద్ద దెబ్బ పడినట్లే.ఇన్ని సంవత్సరాలుగా ఆయనతో ఉన్న పార్టీ క్యాడర్ కాని నాయకులు గానీ కార్యకర్తలు కానీ ఈసారి కచ్చితంగా ఆయనకు దూరంగా వెళ్ళి పోవడం జరుగుతుంది.అందుకే వైఎస్సార్ పార్టీ ఈసారి తన సర్వశక్తులూ ఒడ్డి ఎలాగైనా గెలిచి తీరాలని సామ దాన భేద దండోపాయాలను కూడా ప్రయోగించాలని చూస్తుంది.
ఇకపోతే తెలుగుదేశం పార్టీ గత రెండు పర్యాయాలు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికి ఈసారి ఆ పార్టీ కూడా ఎన్నికల్లో అంత ఈజీ ఎం కాదు.గత సారి ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు ఎలాగో గట్టెక్కిన ఈసారి అనూహ్యంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి కూడా శత్రువుగా మారారు.మరోపక్క గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రజల్లో తిరుగుతూ ఆయన పలుకుబడిని బాగా పెంచుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ అవినీతిని అధికార దుర్వినియోగాన్ని ఎండగడుతూ ప్రజల్లో ఆయన పట్ల ఒక విధమైన నమ్మకాన్ని సానుభూతిని పెంచుకుంటున్నారు.ఇద్దరు బలమైన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో తలపడి ఈసారి గెలుస్తుందో లేదో వేచి చూడాలి.
మొత్తానికి  ఎన్నికల సంఘం కేటాయించిన జిల్లా స్పూర్తి ఆ పార్టీ కార్యకర్తల్లో ఒక విధమైన ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపింది.ఇప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రధాన పార్టీలకు ఎన్నికల గుర్తులు ఉండడంతో ఇక ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైనట్లే.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

పవన్ కు కోటి రూపాయలు సాయం చేసిన వరుణ్ తేజ్!!!

Mon Dec 24 , 2018
పవన్ కు కోటి రూపాయలు సాయం చేసిన వరుణ్ తేజ్!!! Image credit from https://goo.gl/images జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తన ఫ్యామిలీ నుండి తన చిన్న అన్నయ్య నాగబాబు ఆయన కుమారుడు హీరో వరుణ్ తేజ్ మద్దతుగా నిలిచారు ఈ విషయంలో అని అనుకుంటున్నారా సినిమా విషయంలో కాదు ఆయన రాజకీయ పార్టీ జనసేన విషయంలో. పవన్ కళ్యాన్  జనసేన పార్టీకి […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: