పిచ్చెక్కిస్తున్న సినిమా ట్రైలర్

పిచ్చెక్కిస్తున్న సినిమా ట్రైలర్

2007-2013 మధ్య జరిగిన 57 బాంబ్ బ్లాస్ట్‌ల నేపథ్యంలో రైడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్‌ గుప్తా తెరకెక్కించిన చిత్రం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్. అర్జున్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. బిన్ లాడెన్స్ స్పూర్తితో కరుడుగట్టిన ఓ ఉగ్రవాది చేసిన దారుణ ఘటనలను ఈ చిత్రం ద్వారా చూపించనున్నారు. ఇండియాస్ ఒసామా అనే పిలవబడే ఆ వ్యక్తిని మనదేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులు బుల్లెట్ కూడా వాడకుండా ఎలా పట్టుకున్నారు అన్న నేపథ్యంలో సినిమా తెరకెక్కించారు. ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ ప్రభాత్‌ పాత్రను అర్జున్ కపూర్ పోషించారు. మే 24న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులలో సినిమాపై భారీ అంచనాలు పెంచింది. రాజేష్ శర్మ, ప్రశాంత్ అలెగ్జాండర్‌, గౌరవ్ మిశ్రా, ఆసిఫ్ ఖాన్, సాన్‌టిలాల్ ముఖర్జీ, బజ్‌రంగబలీ సింగ్, ప్రవీణ్ సింగ్ సిసోడియా తదితరులు చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. అమిత్ త్రివేది చిత్రానికి సంగీతం అందించారు.
Trailer 
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

జెర్సీ సినిమాకు "U' సర్టిఫికేట్

Tue Apr 16 , 2019
నేచురల్ స్టార్ నాని క్రికెటర్ గా నటిస్తోన్న సినిమా జెర్సీ. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు “U’ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: