ఫైజర్ వ్యాక్సిన్ వచ్చేస్తుంది… క్రిస్మస్ కంటే ముందే రెడీ!!

ఫైజర్ వ్యాక్సిన్ వచ్చేస్తుంది… క్రిస్మస్ కంటే ముందే రెడీ!!

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా చాలా కంగారు పెడుతుంది. ప్రతి రోజు కొన్ని లక్షల కేసులు వస్తున్నాయి. అసలు ఈ మహమ్మారికి అంతం లేదా అని ప్రజలు చాలా ఆందోళన పడుతున్నారు. ఇక అమెరికాలో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అక్కడ కరోన  పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ఆ కేసుల సంఖ్య ఎన్ని రోజులకు తగ్గుముఖం పడుతుందో ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.కరోనా వ్యాక్సిన్ కోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. చాలా సంస్థలు ఇప్పటికే తమ వ్యాక్సిన కోసం చివరి దశ హ్యూమన్ ట్రయల్ కూడా మొదలు పెట్టాయి దాంతో వ్యాక్సిన్ రావడానికి ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాదిలో వస్తుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు.

ఫైజర్ వ్యాక్సిన్ వచ్చేస్తుంది… క్రిస్మస్ కంటే ముందే రెడీ!!

అయితే ఇంత నిరాశలో కూడా ఒక చిన్న చిరు దీపంలా అన్నట్టు కరోన వ్యాక్సిన్ తయారీలో మిగత కంపెనీల కంటే ముందున్న ప్రముఖ ఫార్మా సంస్థ అయిన    ఫైజర్ సంస్థ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తమ కంపెనీ కోవిడ్ నిర్మూలన కోసం శరవేగంగా  రెడీ చేస్తున్న  ఫైజర్ టీకా 95 శాతం ఫలితాలు ఇస్తున్నట్టు అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ ఫాసి ఇప్పటికే ఒక ప్రకటనలో చెప్పారు. అయితే తమ టీకా దాదాపు 95 శాతానికి సేఫ్ అని వాళ్ళు ఇప్పుడు చెపుతున్నారు. అలాగే కరోనా కల్లోలం మళ్ళీ పెరుగుతుంది అన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కరోన టికా   అత్యవసర వినియోగం కోసం ఈ ఫైజర్ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థకు తమకు త్వరగా కరోనా టీకా ప్రజలకు అందించేలా పర్మిషన్ ఇవ్వాలని దరఖాస్తు కూడా చేసుకుంది.  ఆ పర్మిషన్స్ రాగానే టీకాను తయారు చేస్తామని ఇదే ఇయర్ క్రిస్మస్ కంటే ముందే టీకా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు బయో ఎన్ టెక్ సీఈవో ఉగర్ సహీన్ చెపుతున్నారు. ఈ ఇయర్ చివరి వరకు 5 కోట్ల కరోన వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేస్తామని బయోఎన్ టెక్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే సంవత్సరం 2021 నాటికి తాము దాదాపు 13 కోట్ల డోసులు తయారు చేస్తామని తమ కంపెనీ కరోన టీకా పంపిణి కోసం ఇతర దేశాలు అయిన బ్రెజిల్, జర్మనీ, జపాన్, యూరోపియన్ యూనియన్ లతో ఇప్పటికే అన్ని రకాలుగా అగ్రి మెంట్స్ ఒప్పందాలు చేసుకున్నట్టు బయో ఎన్ టెక్ సంస్థ చెప్పింది.  

Leave a Reply

Next Post

The Top 100 Films You Should Not Miss Part-1

Thu Nov 19 , 2020
The Top 100 Films You Should Not Miss Part-1 Lockdown became the only time to entertain in many ways. Like Discovering films, games, etc., So here are the top most 100 films you should not miss and must watch movies. Let’s get into the topic. 1. THE SECRET IN THEIR […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: