బిగ్ బాస్ ఇంటి దయ్యం జలజ ఈవిడేనా ???

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఇంట్లోకి జలజ అనే దయ్యం వచ్చింది. ఆ విషయం లో అరియానా చాలా భయపడింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ ఆ దయ్యాన్ని ఎదురించి మాట్లాడే సరికి నా పేరు జలజ అని, నేను బిగ్ బాస్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నా అని, ఈ ఇంటి రూల్స్ ని ఉల్లంఘిస్తే తనకు నచ్చదు అని చెప్పింది. ఆ తర్వాత సోహెల్ కి పోల్ డాన్స్ చెయ్యమని, అభిజీత్ కి చెట్టు ఆకులు లేక్కబెట్టమని చెప్పింది. ఇదంతా విన్న హౌస్ మేట్స్ మేము నువ్వు చెప్తే ఎందుకు చెయ్యాలి, మాకు, బిగ్ బాస్ కి కూడా కొన్ని ఒప్పందాలు జరిగాయి అని అన్నారు. మేము బిగ్ బాస్ చెప్తే తప్ప చెయ్యము అని అన్నారు. ఆ తర్వాత వారికి ఒక లెటర్ వచ్చింది అందులో అభిజీత్, అఖిల్ లు మోనాల్ ని చాల ఏడిపించారు, జలజ వాయిస్ వినిపించగానే వారు క్విజ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందని, అందులో ఎవరు గెలిస్తే వారు మోనాల్ ని డేట్ కి తీసుకు వెళ్ళాల్సి ఉంటుందని ఉంది.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఎంటంటే, బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఇచ్చే ప్రతి టాస్క్ లెటర్ మీద “ గుడ్ లక్ బిగ్ బాస్” అని ఉంటుంది. ఆ విషయాన్ని అవినాష్ గ్రహించి హౌస్ మేట్స్ కి చెప్పాడు. దాంతో హౌస్ మేట్స్ అందరూ, మేము బిగ్ బాస్ చెప్తే తప్ప చెయ్యము అనే సరికి బిగ్ బాస్ “ ఇది లక్జరి బడ్జేట్ టాస్క్ ఇది మీదు అందరు చెయ్యాల్సి ఉంటుంది, అభిజీత్ మీరు మోనాల్ ని డేట్ కి తీసుకెళ్ళను అన్నారు, అందుచేత అఖిల్ మీరు మోనాల్ ని డేట్ కి తీసుకు వెళ్ళండి అని అన్నారు. ఆ తర్వాత అభిజీత్ చెట్టుకి ఉన్న ఆకులు లెక్కబెట్టక పోగా, సోహెల్ పోల్ డాన్స్ చెయ్యడం జరిగింది. ఇంతకీ ఈ జలజ ఎవరు ?

జలజ తనని తానూ ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు హౌస్ మేట్స్ అందరు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లుంది అని అనుకున్నారు. ఆ సమయంలో అవినాష్ ఈ వాయిస్ స్వాతి దీక్షిత్(వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన హౌస్ మెట్) లా ఉంది అని అన్నాడు. ఆ తర్వాత తను నాతో ఒకరోజు రాత్రి మనం దయ్యం గెటప్ వేసుకొని అందర్నీ భయపెడదాం అని చెప్పింది, బహుశ తనేనేమో అని అన్నాడు. పక్కనే ఉన్న హరికి తన వాయిస్ ఇలా ఉండదు కదా అని చెప్పడంతో అందరు వదిలేసారు. ఆ తర్వాత ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమో అని కూడా అనుకున్నారు. అయితే ఇది స్వాతి దీక్షిత్ రీ ఎంట్రీ అని కొందరు, ఇది జస్ట్ టాస్క్ అని కొందరు, ఎవరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారు అని కొందరు, బిగ్ బాస్ TRP పెంచడానికి ప్లాన్ చేసారు అని కొందరు, అది గీతా మాధురి వాయిస్ అని, గెస్ట్ గా వస్తారు  అని కొందరు అంటున్నారు. మరి ఆ దయ్యం జలజ ఎవరో తెలియాలంటే బిగ్ బాస్ ఎపిసోడ్ లు చూడాల్సిందే…..

Leave a Reply