బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగానే ఉంది

బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగానే ఉంది

ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు పద్మశ్రీ డా: బ్రహ్మానందం  ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని ఆయన తనయుడు హీరో గౌతమ్ తెలిపారు.  కొన్ని నెలలుగా ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్  లోని ప్రముఖ డాక్టర్ ను సంప్రదించారు బ్రహ్మానందం. మరి సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.దేశంలోనే అత్యుత్తమైన ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో సోమవారం నాడు గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ప్రముఖ హృదయ నిపుణులు శ్రీ రమాకాంత్ పాండా బ్రహ్మానందం గారికి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది ఐసీయు నుంచి సాధారణ గదికి మార్చడం జరిగిందని తెలిపారు. బ్రహ్మానందం గారికి శస్త్రచికిత్స జరిగింది అని తెలిసి ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు మిత్రులు సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు అందరి ప్రేమానురాగాలు ఆశీస్సుల వల్లే బ్రహ్మానందం గారి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తనయుడు గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఆనందం తనయుడు గౌతమ్ రాజా, సిద్ధార్థ్ ఆయన వెంటే ముంబైలోని ఆస్పత్రిలో ఉన్నారు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

రిషబ్ పంత్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఇషా నేగి

Thu Jan 17 , 2019
రిషబ్ పంత్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఇషా నేగి https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: