భారతీయుడు-II హిట్టా ఫట్టా


భారతీయుడు-II హిట్టా ఫట్టా

నిజం చెప్పాలంటే  సూపర్‌ హిట్‌ అయిన చాలా సినిమాలకు సీక్వెల్స్‌ అంటూ అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి.కానీ చాలా వరకు  అవన్నీ ఏవో పుకార్లు గానే  మిగిలిపోతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం శంకర్, కమల్ హాసన్ ల కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ పార్ట్‌ అంటే చాలా మంది ఇది కూడా ఒక పుకారు అనుకున్నారు. కానీ చిత్రంగా ఈ సినిమా సీక్వెల్‌ ప్రతిపాదన దశ నుంచి పట్టాలెక్కే దశకు వచ్చింది భారతీయుడు-II
సీక్వెల్ అంటే మినిమం లాజిక్‌ ఉండాలని సగటు సినీ ప్రేక్షకుడు కోరుకుంటాడు. అది గత చిత్రంలో ఉన్న ప్రధాన పాత్ర, ఇక ఆ సినిమాలో బాగా క్లిక్ అయిన వేరే ఏ పాత్ర అయిన సరే ఉండాలనుకుంటాడు. నిజానికి ప్రపంచంలో ఎక్కడ ఏ భాషలో సీక్వెల్ సినిమా లు తీసినా ఇలాగే ఉండేలా అందరూ జాగ్రత్త పడ్డారు. కానీ ఒక్కోసారి ఆ  సినిమా సీక్వెల్ తీసే సదరు హీరో, దర్శకుడు మాత్రం అలా అనుకోవడం లేదు. 
ఇక హిందీ వాళ్ళకయితే  సీక్వెల్‌ అన్న పదానికి అర్థాన్నే మార్చేసారు. ముందు వచ్చిన సినిమాకు  అసలే మాత్రం సంబంధం లేని కథలను, ఆ కథకు ఏమాత్రం సంబంధం లేని సినిమాకు సీక్వెల్స్‌ అంటూ ఇప్పటికి అలా చాలా సినిమాలే తీశారు.  ఇక మన దగ్గర మాత్రం  సీక్వెల్‌ అనగానే ఆ సినిమా హీరో, దర్శకుడి కాంబినేషన్ ఉంటే చాలు ఏదో కొత్త కథ తో సినిమా తీసి మార్కెట్ చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇకపోతే పరభాషా చిత్రాల్లో ఆ సిన్రమాల్లో మంచి కథ ను బట్టో, కామెడీని బట్టో కొన్ని సినిమాలు తెలుగులో బాగా హిట్ అయ్యాయి. ఇప్పుడా మేకర్స్ తమ చిత్రాల సీక్వెల్స్ అనౌన్స్ చేయడం ద్వారా తెలుగు లో కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తూ తమ మార్కెట్ ని కూడా పెంచుకుందాం అని చూస్తున్నారు.    పలానా హిట్ సినిమాకు సీక్వెల్  అంటే కాస్త ఓపెనింగ్స్‌ పెరుగుతాయనే ఆశలు ఉండవచ్చు. ఇలా సీక్వెల్‌ అనేది కథతో సంబంధం లేని ఒక మార్కెటింగ్‌ టెక్నిక్‌ అయిపోయింది.
కానీ, శంకర్‌, కమల్ హాసన్ లకు మరీ అంత అవసరం లేకపోవచ్చు. శంకర్‌ – కమల్‌హాసన్‌ కాంబోలో సినిమా అంటే వచ్చే హైప్, అదిరిపోయే ఓపెనింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత ఒక కాంబినేషన్  రిపీటవుతున్న కూడా  వీళ్ల సినిమా పట్ల ఆసక్తి ఒక రేంజ్ లో ఉంది. ఇక ఇప్పుడు పెరిగిపోయిన కలెక్షన్ లు చూసుకుంటే ఈ సినిమా    బడ్జెట్‌ కూడా చాలా పెద్దది గానే ఉండే అవకాశం ఉంది. ఇంత భారీ సినిమా కాబట్టి మార్కెటింగ్  పరంగా కూడా చాలా సేఫ్‌జోన్లో ఉంటుంది. అయినా వీళ్లు సీక్వెల్‌ పేరుతోనే వస్తున్నారు. అయితే ఇప్పుడు సినీ అభిమానులందిరి మదిని తొలుస్తున్న ప్రశ్న ఏంటంటే భారతీయుడు సీక్వెల్ లో శంకర్ ఎలాంటి కథా మార్పులు చేయబోతున్నాడు…

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

Revisión: MOWGLI: LEYENDA DE LA SELVA

Tue Dec 11 , 2018
 Revisión: MOWGLI: LEYENDA DE LA SELVA Del actor / director Andy Serkis, surge una versión más oscura y seria de las historias de Rudyard Kipling que cualquiera de las adaptaciones de Disney. Después de ser retenido para el trabajo de postproducción y para esperar un momento ideal de lanzamiento, esta […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: