
ప్రపంచ సినిమాలో ఆస్కార్ అవార్డు అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఏ దేశం సినిమా వాళ్ళు అయినా కూడా తమ లైఫ్ లో ఒక్కసారయినా ఆస్కార్ అవార్డు గెలవాలని కోరుకుంటారు వాళ్ళలో హీరోలు హీరోయిన్ లు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఉంటారు. ఇక లాస్ట్ ఇయర్ అయితే కొరియా దర్శకుడు బోంగ్ జూ హు ప్యార సైట్ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకుని ఆ దేశం నుంచి ఆ ఘనత సాదించిన మొదటి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేసాడు. ఇక మిగతా విభాగాలు అయిన ఉత్తమ చిత్రం, అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డ్స్ కూడా ప్యార సైట్ సినిమా గెలుచుకుని సంచలనం సృష్టించింది.
అయితే ఈ సంవత్సరం ఇండియా నుంచి ఆస్కార్ అవార్డు కోసం అఫీషియల్ గా మలయాళ చిత్రం జల్లికట్టు ఎంపికైంది దీనికి లిజో జోసో పెల్లిసేరి దర్శకుడు. విభిన్న చిత్రాలు తీస్తాడనే పేరున్న ఆయన మలయాళంలో తీసిన ‘అనగమలీ డైరీస్’ అలాగే ‘ఈ మా యు’ సినిమాలతో లిజో ఇప్పటికే దేశ వ్యాప్తంగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక జల్లికట్టు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కేరళలో ఒక చిన్న గ్రామంలో ఒక గేదె ఆ ఉరి వాళ్ళను ఇబ్బంది పెడుతూ రంకెలు వేస్తూ అందరిని భయ బ్రాంతులకు గురి చేయడం దాన్ని పట్టుకోవడానికి ఆ ఉరి ప్రజలు ప్రయత్నం చేయడం అన్నది సినిమా కథ. 2019లో విడుదలయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.ఇప్పటి వరకు మన దేశం నుంచి ఎన్నో సినిమాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడినప్పటికీ కూడా ఒక్కసారి కూడా అవార్డు గెలుచుకోలేదు మరి ఈసారి అయినా మన ఆస్కార్ కల జల్లికట్టు సినిమాతో నెరవేరుతుందో లేదో చూడాలి.