మళ్ళీ సినిమాల్లోకి రేణు దేశాయ్ రీ ఎంట్రీ


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య తెలుగులో మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది ఆమే రేణుదేశాయ్‌. ఇటీవల తాను ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించేసింది. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లం కొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాతో రేణుదేశాయ్‌ రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. పవన్‌ సరసన ‘బద్రి’, ‘జానీ’ సినిమాల్లో నటించిన రేణుదేశాయ్‌ ఆ తర్వాత నటనకు పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. పవన్‌కళ్యాణ్‌తో సహజీవనం, పెళ్ళి, ఆ తర్వాత విడాకులు.. ఇటీవలే మళ్ళీ పెళ్ళికి రేణుదేశాయ్‌ సిద్ధమవడం కూడా అందరికీ తెలిసిన విషయాలు.

అయితే ఈ మధ్యనే ఓ డాన్స్‌ షో ద్వారా బుల్లితెర ఎంట్రీ కూడా ఇచ్చిన రేణుదేశాయ్‌, మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధమవడం విశేషమే. ఎందుకంటే రేణుదేశాయ్‌ పెదవి విప్పితేచాలు, ఘాటైన విమర్శలతో విరుచుకుపడిపోతుంటారు పవన్‌కళ్యాణ్‌ అభిమానుల పేరుతో కొందరు వ్యక్తులు మరి అలాంటిది ఇప్పుడు ఏకంగా రేణుదేశాయ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ రీ-ఎంట్రీ ఇస్తే వాళ్లంతా ఇంకెంతలా రెచ్చిపోతారో ఏమో చూడాలి ఎవరిగోల ఎలావున్నా, రేణుదేశాయ్‌ మాత్రం తిరిగి మళ్ళీ సినిమాల్లో నటించాలనే తన కోరికను తీర్చుకోబోతోంది.

కాగా రేణు దేశాయ్ నటించనున్న సినిమా విషయానికి వస్తె ప్రముఖ సంఘ సంస్కర్తగా పేరొందిన హేమలత లవణం పాత్రలో రేణుదేశాయ్‌ నటిస్తోంది. గుర్రం జాషువా కుమార్తె అయిన హేమలత లవణం, రచయిత్రిగానూ పేరు ప్రఖ్యాతులు పొందారు. అంటరానితనానికి వ్యతిరేకంగా నినదించారామె. అలాంటి పాత్రలో రేణుదేశాయ్‌ నటించడమంటే ఖచ్చితంగా మంచి అంచనాలే వుంటాయి. సినిమాల్లో తన రీ ఎంట్రీ విషయాన్ని స్వయంగా రేణుదేశాయ్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ‘దొంగాట’ ఫేం వంశీకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. సినిమాల్లో మళ్ళీ నటించాలన్న కోరిక ఇలా తీరుతోందనీ, ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్‌ చెబుతున్నాననీ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో పేర్కొంది రేణుదేశాయ్‌.

రేణుదేశాయ్‌కి సైతం కవితలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇంగ్లీషులో తాను రాసిన కవితల్ని తెలుగులోకి ఇటీవల తర్జుమా చేయించుకున్నారామె. ప్రముఖ సినీపాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌, రేణుదేశాయ్‌ ఇంగ్లీషు కవితల్ని తెలుగులోకి అనువదించాడు.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ దే హవానా?

Wed Feb 20 , 2019
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి పక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ మరింతగా పెరిగిందని పేర్కొంది ఇండియాటుడే. అక్కడ మరికొన్ని నెలల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వివిధ సర్వేలు నిర్వహిస్తూ వస్తున్న ఈ ఇంగ్లిష్ వార్తా చానల్ తాజాగా ఏపీలో రాజకీయ పరిస్థితి గురించి తన అంచనాలను వెలువరించింది. వాటి ప్రకారం ఆరునెలల కిందటితో పోలిస్తే ఇప్పుడు వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: