మహేష్ బాబు ఎ ఏం బి సినిమాస్ కు నోటిసులు


Mahesh Babu Krishna at AMB Cinemas opening
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్తగా సినిమా వ్యాపారంలోకి దిగి AMB సినిమాస్ ను ప్రారంభించిన విషయం గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి రంగ రెడ్డి జీ ఎస్ టి అధికారులు నోటిసులు అందించారు దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం తగ్గించిన జీ ఎస్ టి రేట్స్ ఆధారంగా సినిమా టికెట్స్ ధర సదరు సినిమా యాజమాన్యం వారు తగ్గించ లేదని ఇంకా పాత రేట్స్ ఆధారంగా చేసుకుని ప్రేక్షకుల దగ్గర సినిమా టికెట్స్ ధరలు వసూలు చేస్తున్నారు అని ఇచ్చారు. జనవరి 1 , 2019 నుంచి ప్రభుత్వం కొత్త జీ ఎస్ టి ప్రకారం సినిమా టికెట్ ల ధరలను తగ్గిస్తూ వుత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి AMB సినిమాస్ తో పాటు నగరంలో మరికొన్ని థియేటర్ యాజమాన్యాలు కూడా పాత టికెట్ రేట్స్ నే వసూలు చేస్తున్నాయి అని చెపుతూ అధికారులు వాటికి కూడా నోటిసులు ఇస్తామని చెపుతున్నారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా మహర్షి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారనీ వార్తలు వస్తున్నాయి.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

నాయనా రారా ఇంటికి అంటున్న శ్రీనివాస్ అవసరాల(NRI)

Wed Feb 20 , 2019
దర్శకుడు నటుడు శ్రీనివాస్ అవసరాల హీరోగా ఒక కొత్త సినిమా రాబోతుంది దాని పేరు NRI రా రా నాయనా ఇంటికి అని ఫిక్స్ చేశారు. ఈ సినిమాతో బాలు రాజశేఖర్ అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. మెగా బ్రదర్ నాగబాబు మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా పూర్తిగా వినోదభరితమైన చిత్ర మని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో ఉండే ఒక […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: