మహేష్ బాబు ఫోటో లీక్ – సరిలేరు నీకెవ్వరు’

0 0
Read Time:1 Minute, 52 Second

 మహేష్ బాబు ఫోటో లీక్ – సరిలేరు నీకెవ్వరు’


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ షూటింగ్ లో మహేష్ బాబు కూడా జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. 

అయితే ఆ గెటప్ లో మహేష్ ఎలా ఉంటాడో చూడాలనే ఆసక్తి అభిమానుల్లో కలుగుతోంది. ఇప్పుడు ఆ గెటప్ కి సంబంధించి ఓ ఫోటో లీక్ అయింది. షూటింగ్ లొకేషన్ లో మహేష్ మిలిటరీ దుస్తులు ధరించి తన తోటి ఉద్యోగులతో ఏదో చర్చిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. 

ఈ ఫోటోలో మహేష్ పక్కన రాజేంద్రప్రసాద్ కూడా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన్నా కనిపించనుంది. 

సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Menu
%d bloggers like this: