మహేష్ బాబు సాయిపల్లవి ఫిక్స్??


Saipallavi at an event

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టు ఓకె అయిపోయింది. F 2 తో సంక్రాంతి కి మాంచి హిట్ కొట్టిన అనిల్ రావిపూడి డైరక్టర్. నిర్మాతలు దిల్ రాజు-అనిల్ సుంకర కలిసి ఈ చిత్రం నిర్మిస్తారు. ఈ మధ్య కాలంలో అన్నీ హిట్ సినిమాలే చేస్తున్న దేవీశ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ అందించబోతున్నారు. అయితే ఇక్కడే అసలు మెలిక పడింది సినిమాకి మెయిన్ వాళ్లంతా ఓ కే అయ్యారు కానీ ఇప్పుడు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సరసన హీరోయిన్ అంటే ఏ రేంజ్ లో ఉండాలి ఇప్పటికే కైరా అద్వానీ లాంటి కొత్త అమ్మాయిని ట్రై చేశారు ఇప్పుడు మళ్ళీ కొత్త ఫేస్ అంటే ఎలా అని ఆలోచిస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో తన నటనతో అన్ని హిట్ సినిమాలతో సాంగ్స్ తో ఊపు మీద ఉన్న యూత్ సెన్సేషన్ సాయిపల్లవిని తీసుకోవాలని ఆలోచిస్తున్నార ట ఏంటి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా… అవును ఇది నిజమే.. సాయిపల్లవితో మహేష్ బాబు కూడా సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా లైన్ సాయి పల్లవికి చెప్పి ఎలాగైనా ఆమెను ఒప్పించడానికి దర్శకుడు అనిల్ రావిపూడి బయల్దేరి చెన్నయ్ వెళ్లార ని అలాగే పనిలో పనిగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ కు కూడా సినిమా లైన్ చెప్పి ఆయన్ని కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ కు ప్రిపేర్ చేసే పనిలో పడ్డారు అని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి నిజానికి శేఖర్ కమ్ముల సినిమా ఫిదా తో తెలుగు తెరకు పరిచయమైనా ఆమెతో తెలుగులో వెంట వెంటనే సినిమాలు చేసింది నిర్మాత దిల్ రాజు గారు సో ఇప్పుడు మహేష్ బాబు తో అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లో కాబట్టి సాయి పల్లవి నీ ఇప్పించడం అంత కష్టమైన పనే కాదు అలాగే సాయి పలవికి అద్భుతమైన హిట్ ల ట్రాక్ రికార్డ్ వుంది.

ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు కూడా ఓకె అంటే తాను తెలుగులో స్టార్ హీరోయిన్ ల రేంజ్ లోకి వెళ్లినట్లు అవుతుంది. ఎలాగూ తెలుగు లో మహేష్ చరణ్ బన్నీ ల సినిమాలకు కొత్త హీరోయిన్ లు లేరు ఇప్పుడు ఈ సినిమా చేస్తే ఆ ప్లేస్ ను సాయి పల్లవి భర్తీ చేసినట్లు కూడా అవుతుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కథ, అందులో పాత్ర సాయిపల్లవిని ఇంప్రెస్ చేసి తను గనక ఈ సినిమా ఒప్పుకుంటే తెలుగు తెర మీద ఒక కొత్త కాంబినేషన్ ను మనం చూడొచ్చు.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

సుకుమార్ మహేష్ బాబు సినిమా ఆల్ ఇజ్ వెల్

Mon Mar 4 , 2019
హమ్మయ్య అటు తెలుగు లో మాంచి హిట్లు ఇచ్చి మళ్ళీ ఫ్లాప్ ల్లో పడ్డ పెద్ద బ్యానర్ మైత్రి మూవీస్ కు, ఇటు రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఇన్ని రోజులు ఖాళీగా ఉన్న దర్శకుడు సుకుమార్ కు ఓ భారం తీరిపోయింది. దానికి కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎందుకు అంటే ఇన్ని రోజులు సుకుమార్ ఏ స్టోరీ చెప్పినా ఓ కే అనని […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: