4.1 C
New York
February 27, 2021
CINEMA RASCALS
Tollywood

మార్చి 5 నుంచి రాజీవ్ సాలూరి ‘అన్ నోన్’ రెగ్యులర్ షూటింగ్

నోట్ బుక్ , ప్రేమంటే సులువు కాదురా, ఆకాశమే హద్దు, ఓరి దేవుడోయ్, చిన్ని చిన్ని ఆశ వంటి సినిమాలతో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరో గా అందరికి సుపరిచయమయ్యాడు . తన నటన తో ఇప్పటికే కొంత అభిమానాన్ని అందుకున్న రాజీవ్ నటించబోతున్న కొత్త చిత్రం ”అన్ నోన్’ మార్చి 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుంది. ఈ విషయాన్నీ దర్శక నిర్మాతలు వెల్లడించగా, క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఆర్కే నల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. నారాయణరావు అట్లూరి వైష్ణవి ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోటి మరో తనయుడు రోషన్ సాలూరి సంగీతం అందిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత నారాయణరావు అట్లూరి మాట్లాడుతూ మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం.. దర్శకుడు ఆర్కే నల్లూరి చెప్పిన కథ చాలా బాగుంది.. పూర్తిగా కథను నమ్మి చేస్తున్న సినిమా ఇది.. రాజీవ్ గత సినిమాల్లో చాలా బాగా చేశాడు.. ఈ కథ కు అయన చాలా బాగా సూట్ అవుతున్నాడు.. ఈ మార్చి 5 నుంచి షూటింగ్ కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం.. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం అని అన్నారు.

The post మార్చి 5 నుంచి రాజీవ్ సాలూరి ‘అన్ నోన్’ రెగ్యులర్ షూటింగ్ first appeared on https://www.123telugu.com/telugu.

Source link

Related posts

Samantha and Naga Chaitanya Go on A Drive in Hyderabad In Benz Car

cinemarascals

ఆ క్రేజీ మల్టీస్టారర్ లో కియారా అద్వానీ ?

cinemarascals

Anchor Anasuya Strong Counter To Netizens For Abusive Trolls On Social Media

cinemarascals

Leave a Reply

[fiverr_affiliates_search_box width="100%"]
%d bloggers like this: