మా ఎన్నికల్లో గెలిచిన నరేష్!! చిరంజీవి మద్దతే కారణమా??


నిన్న ఆదివారం జరిగిన  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ బంపర్ మెజారిటీతో గెలుపొందారు. అటు శివాజీ రాజా ఇటు నరేష్ మధ్య ఆరోపణలు ప్రత్యరోపణల తో మాంచి హాట్ హాట్ గా జరిగిన ఈ ఎన్నికలు చాలా మంది దృష్టినీ ఆకర్షించాయి. అయితే ఇక్కడ అసలు నిజం ఏంటంటే
మెగా కాంపౌండ్ ఆశీస్సులు ఎవరికి ఉంటే వాళ్లే అధికారంలోకి వస్తారు. తరతరాలుగా ఇదే జరుగుతూ వస్తుంది ఇందులో నందమూరి వారి కుటుంబ జోక్యం కూడా చాలా తక్కువగాననే వుంటుంది. ఇది బహిర్గత సత్యమే… అందుకే ఈసారి కూడా అదే జరిగింది.నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆఖరి నిమిషంలో నరేష్ ప్యానెల్ కు మద్దతు పలికింది మెగా కాంపౌండ్. నిజానికి చిరంజీవి సూచన మేరకే మెగా బ్రదర్ నాగబాబు రంగంలోకి దిగి ప్రెస్ మీట్ పెట్టడంతో, రిజల్ట్ టర్న్ అయింది. మా ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ గెలిచింది శివాజీ రాజా ప్యానెల్ ఓడి పోయింది. 

వాస్తవానికి అటు శివాజీరాజా, ఇటు నరేష్ ఇద్దరూ మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా వాళ్లకు తన మద్దతు ఉంటుందంటూ చిరంజీవి ఎప్పటిలానే చాలా డిప్లమాటిక్ గా సమాధానం ఇచ్చారు. అయితే ఆఖరి నిమిషంలో తెరవెనక చాలా జరిగిందంటారు. స్వయంగా మహేష్ బాబు చిరంజీవికి ఫోన్ చేసి, నరేష్ కు మద్దతివ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశారట. దీనికితోడు మరికొందరు పరిశ్రమ ప్రముఖులు కూడా శివాజీరాజాకు వ్యతిరేకంగా చిరంజీవికి ఫోన్ కాల్స్ చేసినట్టు తెలుస్తోంది. వీటి ఫలితమే 3 రోజుల కిందట నాగబాబు ప్రెస్ మీట్. ఇప్పటి ఎన్నికల ఫలితం. 

చివరికి ఎలాగైతేనేం “మా” అధ్యక్షుడిగా నరేష్ గెలిచాడు. మొన్నటివరకు తనను ఇబ్బందిపెట్టిన, అవమానపరిచిన శివాజీరాజాపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఎన్నికల్లో నరేష్ కు 268 ఓట్లు వస్తే, శివాజీ రాజాకు 199 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఉపాధ్యక్షులిగా హేమ, ఎస్వీ కృష్ణారెడ్డి ఎన్నికయ్యారు.

ఎవరూ ఊహించ నీ విధంగా లాస్ట్ మినిట్ లో రాజశేఖర్ కుటుంబాన్ని రంగంలోకి దించిన నరేష్, ఆ దిశగా కూడా విజయాన్ని అందుకున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ గా రాజశేఖర్, కీలకమైన జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవిత రాజశేఖర్ ను గెలిపించుకున్నారు. మొన్నటివరకు మెంబర్ గా మాత్రమే ఉన్న శివబాలాజీ, ఈసారి జాయింట్ సెక్రటరీగా గెలిచాడు. ‘మా’ లో ఓ పదవి అందుకున్నాడు. 

ఈసారి ఎన్నికల్లో గతంలోలా మరీ దారుణంగా తిట్టుకున్న ఉదంతాలు తక్కువగానే ఉన్నప్పటికీ, తెరవెనక మంత్రాంగం భారీ ఎత్తున నడిచింది. లేటెస్ట్ ట్రెండ్ ను ప బట్టి చూస్తే, ఇకపై ప్రతిసారి మా లో ఎన్నికలు ఖచ్చితంగా జరిగేలా నే ఉన్నాయి.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

వైసీపీలో చేరిన సినీ నటుడు ఆలీ

Mon Mar 11 , 2019
ప్రముఖ సినీ నటుడు ఆలీ తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నివాసం లోటస్ పాండ్ లో ఆయనను కలిసి జగన్ సమక్షంలో ఆలీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నిజానికి ఆలీ హీరో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: