మిలియన్ డాలర్ క్లబ్ లో వెంకీ వరుణ్ ల F 2

మిలియన్ డాలర్ క్లబ్ లో వెంకీ వరుణ్ ల F 2

F2 సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకుడి గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ఈ రోజుతో అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్  లో చేరింది. అటు విక్టరీ వెంకటేష్ కు ఇటు వరుణ్ తేజ్ కు అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి కి ఇదే తొలి మిలియన్ డాలర్ల సినిమా కావడం విశేషం. ఒకవైపు రాంచరణ్ వినయ్ విజయరామ మరోవైపు ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి రెండు భారీ సినిమాల కాంపిటీషన్ ఉన్న కూడా వాటిని తట్టుకుని నిలబడి F 2 సంక్రాంతి విజేతగా నిలిచింది.
ఫ్యామిలీ కథ కావడం సినిమాలో వెంకటేష్ కామెడీ అద్భుతంగా పండించడంతో దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. భార్యాభర్తలు వారి మధ్య ఉండే గొడవలు తగాదాలు అలకలు ఇలాంటి వాటి మీద సినిమాలో ఉన్న సీన్స్ కు ఫ్యామిలీస్ నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. పండగ పూట మంచి కుటుంబ కథా చిత్రాన్ని పక్షులకు అందివ్వడంతో వాళ్లు ఈ సినిమా కి బ్రహ్మరథం పడుతున్నారు . ఈ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఐదు కోట్ల షేర్ వరకు రాబట్టింది. అటు అమెరికాలో కూడా రెండు మిలియన్ల మార్క్ చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

SUDEEP NEW MOVIE TEASER #KICHA SUDEEP

Tue Jan 15 , 2019
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: