మెగాస్టార్ కు విలన్ దొరికాడా??

అరవింద్ స్వామి 90 లలో అమ్మాయిల రాకుమారుడు అసలు ఆయన్ని సినిమాల్లో చూసి ఇష్టపడని ప్రేమిoచని తనకు అరవింద్ స్వామి లాంటి అబ్బాయి భర్తగా రావాలని కోరుకొని కన్నెపిల్ల లేదంటే అతిశయోక్తి కాదు. అయితే అలా రొమాంటిక్ హీరోగా ఒక వెలుగు వెలిగిన అరవింద్ స్వామి ఆ తర్వాత విలన్ గా మారి సక్సెస్ అయ్యాడు తమిళ్ లో తని ఒరువై అలాగే ఆ సినిమా తెలుగు రీమేక్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధ్రువ సినిమాలో కూడా విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అరవింద్ స్వామి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమాలో విలన్ గా చేస్తున్నారు అని మెగాస్టార్ కు దీటుగా ఆయన విలన్ పాత్ర ఉంటుంది అని అటూ సినిమా సర్కిల్స్ లో ఇటు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది ఇదే నిజం అయితే గనక తెలుగు ప్రేక్షకులకు అదొక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇవన్నీ కేవలం ఉహాగానాలే కాబట్టి అధికారిక ప్రకటన కోసం సినీ అభిమానులు ఎదురుచూడక తప్పదు.

Leave a Reply