మెరుపు కలలు సినిమాకి 22 ఏళ్లు!!

మెరుపు కలలు సినిమాకి 22 ఏళ్లు!!

ప్రభుదేవా అరవింద్ స్వామి కాజోల్ లాంటి భారీ తారాగణంతో 1997 లో వచ్చిన సినిమా మెరుపు కలలు ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక క్లాసిక్. ప్రభుదేవా కెరీర్ లో ముక్కాలా ముక్కాబులా అనే సాంగ్ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో ఈ సినిమాలో వెన్నెలవే వెన్నెలవే అనే పాట గురించి కూడా అంతే గొప్పగా చెప్పుకుంటారు. సినిమా కథ కథనాలు విజువల్స్ అన్నీ అద్భుతమైన రీతిలో ఉంటాయి. ప్రేమ కథను ఒక కొత్త డైమన్షన్ లో చెప్పి జనాలను సమ్మోహన పరచడం ఒక్క రాజీవ్ మీనన్ కు మాత్రమే చెల్లింది.

ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి.  వెన్నెలవే వెన్నెలవే అనే పాట యువ హృదయాలను కొల్లగొట్టింది. సినిమాలో అరవిందస్వామి నటన కాజోల్ అమాయకత్వం ప్రభుదేవా అల్లరితనం ఇలా సినిమాలో ఉన్న మూడు పాత్రల మధ్య చాలా పెద్ద వ్యత్యాసం పెట్టిన దర్శకుడు ఈ ముక్కోన ప్రేమకథని బిగి సడలకుండా అత్యద్భుతంగా నడిపించాడు. సినిమా లో కాజోల్ నటన  అప్పట్లో చాలా పెద్ద సెన్సేషన్ గా మారింది. మెరుపు కలలు సినిమాకి మొత్తం నాలుగు నేషన్ అవార్డ్స్ వచ్చాయి. సంగీత దర్శకుడు ఉత్తమ కొరియోగ్రాఫర్ ఉత్తమ మెయిల్ ప్లేబ్యాక్ సింగర్ ఉత్తమ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డ్స్ దీనికి రావడం జరిగింది. దర్శకుడు రాజీవ్ మీనన్ కెరియర్లో కానీ అటు ప్రభుదేవా అరవింద్ స్వామి కాజోల్ కెరియర్ లలో కూడా మెరుపు కలలు అనే సినిమా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ఉంటుంది.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

కర్ణాటకలో కాంగ్రెస్ - జెడిఎస్ ప్రభుత్వం పడిపోతుందా??

Tue Jan 15 , 2019
కర్ణాటకలో కాంగ్రెస్ – జెడిఎస్ ప్రభుత్వం పడిపోతుందా?? కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బిజెపి అధికారాన్ని  చేజిక్కించుకోలేకపోయింది. చివరి నిమిషంలో జరిగిన అనూహ్య పరిణామాల వల్ల కాంగ్రెస్ జెడిఎస్ పార్టీలు కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని స్థాపించగలిగాయి. అది మొదలు బిజెపి కాంగ్రెస్ జెడిఎస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్ణాటక ముఖ్యమంత్రి […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: