మోదీ బయోపిక్‌ – తొమ్మిది గెటప్స్ లో వివేక్ ఒబెరాయ్


వివేక్‌ ఒబెరాయ్‌ హీరోగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘పీఎం నరేంద్రమోదీ’ అనే టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మోదీ పాత్రలో నటిస్తున్న వివేక్‌ను విభిన్న గెటప్స్‌లో చూపిస్తూ తొమ్మిది లుక్స్‌ను విడుదల చేశారు. ఆదివారమే ఈ పోస్టర్‌ను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చేత విడుదల చేయించాలనుకున్నారు.


కానీ గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ మృతితో కార్యక్రమాన్ని నిలిపివేశారు. కాగాతర్వాత ఈ పోస్టర్ విడుదలయింది. ఒమంగ్‌కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పాత్రలో సినీ నటుడు మనోజ్‌ జోషి నటిస్తున్నారు. ఏప్రిల్‌ 12న ఈ సినిమా విడుదల కానుంది.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

అల్లు అర్జున్ హోలీ సెలబ్రేషన్స్ ఫొటోస్

Thu Mar 21 , 2019
అల్లు అర్జున్ హోలీ సెలబ్రేషన్స్ ఫొటోస్ Tags: allu arjun family holi celebrations,allu arjun,allu arjun holi status,holi 2019,allu arjun family latest video,allu arjun celebrating holi with sneha reddy and kids,allu arjun kids,allu sneha reddy,allu arjun holi celebration,allu arjun holi,dhee jodi,allu harha,jabardasth latest promo,extra jabardasth,jabardasth,mega family holi scelebratios,niharika konidela holi celebrations https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: