రజనీ కాంత్ చివరి సినిమా ఆ డైరెక్టర్ తో!!

రజనీ కాంత్ చివరి సినిమా ఆ డైరెక్టర్ తో!!

                                                image credited from theindianexpress.com

రజనీకాంత్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అయిన ఈ నటుడు ఇప్పుడు వరకు సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రజినీకాంత్ కి ఒక్క భారతదేశంలోనే కాకుండా జపాన్ మలేషియా సింగపూర్ లాంటి దేశాలలో చాలా మంది అభిమానులు ఉన్నారు.  ఒక బస్సు కండక్టర్ గా  తన జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత తమిళ సినిమాల్లోకి ప్రవేశించి అంచలంచెలుగా ఎదిగి సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానుల్లో ఒక దేవుడిగా వెలుగొందుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం తాను ఇచ్చే ఒక స్టేట్మెంట్ తో తమిళనాడు ఎన్నికలని  సైతం ప్రభావితం చేయగలిగిన అంత మహాశక్తిగా రజనీకాంత్ వున్నారు. అయితే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను వస్తానని రజనీకాంత్ ప్రకటించినప్పటి నుంచి ఆయన సినీ అభిమానుల్లో కొంత కలవరపాటు మొదలయ్యింది. రజనీకాంత్ ఎక్కడ సినిమాలు ఆపేస్తారేమోనని వారికి భయం పట్టుకుంది కానీ ఆశ్చర్యంగా రజనీకాంత్ ఈ మధ్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. కబాలి, కాలా, రోబో 2 ఇప్పుడు పేట ఇలా రజనీకాంత్ యువ హీరోలకు దీటుగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఎంత దూరం లేకపోవడంతో ఇక రజనీకాంత్ తాను చేసే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల మీద ఎక్కువగా దృష్టి సారించాలని చూస్తున్నారు. అందులో భాగంగానే రజినీకాంత్ తన చివరి సినిమా దర్శక ధీరుడు రాజమౌళి తో చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. 
రాజమౌళి కూడా ఎప్పటినుంచో తాను రజినీకాంత్ అభిమానిని అని ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితిలో దాన్ని వదులుకోబోనని చాలాసార్లు చెప్పారు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి తోడైతే ఇక కచ్చితంగా రికార్డుల వేట మొదలవుతుంది అని చెప్పక తప్పదు. ఇప్పటికే బాహుబలి లాంటి సినిమాలతో తన రేంజ్ ఏమిటో నిరూపించుకున్న రాజమౌళి రజనీకాంత్ తీసే సినిమా బడ్జెట్ ఏ రేంజ్లో ఉంటుంది ఆ సినిమా ఎన్ని వేల కోట్ల కలెక్షన్లు రాబడుతోంది అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సంక్రాంతికి తమిళనాడులో రిలీజ్ అయిన పేట సినిమా తో సూపర్ హిట్ కొట్టిన రజనీ తన తదుపరి చిత్రం మురుగదాస్ డైరెక్షన్లో చేయబోతున్నారని తెలుస్తుంది అయితే అది పొలిటికల్ చిత్రమా లేదా ఒక మాస్ మసాలా కమర్షియల్ సినిమానా అన్న వివరాలు ఏవీ బయటకు అయితే రాలేదు. సో రజనీకాంత్ మురుగుదాస్ తో సినిమా చేసిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటిస్తారని తెలుస్తోంది అయితే రాజమౌళి రజనీకాంత్ ను ఎలా చూపిస్తారు ఆయనతో ఆయన అభిమానులకు నచ్చే విధంగా ఒక మాస్ మసాలా కమర్షియల్ సినిమా తీస్తారా లేదా మళ్లీ బాహుబలి వంటి ప్రయోగాత్మక సినిమా తీస్తారా అనేది తెలియాలంటే వీరిద్దరి సినిమా మొదలయ్యే దాక వెయిట్ చేయక తప్పదు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

భారత రత్న విజేతలు వీరే

Sat Jan 26 , 2019
భారత రత్నాలు వీరే                                            image credited from naidunia.jagran.com భారత దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఈ ఏడాది ముగ్గురు ప్రముఖులను వరించింది వారిలో ప్రముఖంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ నేత నానాజీ దేశ్ముఖ్ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: