రజనీ కాంత్ పేరును ఎవరూ వాడు కోవద్దంట!!

తమిళ్ హీరో సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. రెండు మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్న టెన్షన్ మొన్నటి వరకు నడిచింది అయితే ఇప్పుడు రజినీకాంత్ ఏకంగా తాను ఈ లోకసభ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని చెప్పడం చర్చనీయాంశం అయింది. తమ పార్టీ టార్గెట్ 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికలు మాత్రమేనని ఇప్పుడు రాబోతున్న లోకసభ ఎన్నికల్లో తమ పార్టీ ఎక్కడ పోటీ చేయడం లేదని ఆయన చెబుతున్నారు. ఏప్రిల్లో జరిగే లోకసభ ఎన్నికలలో తమిళనాడులో ఏ పార్టీ కానీ తనను వాడుకోవద్దని తన ఫొటోను కానీ తమ పార్టీ గుర్తులను కానీ వాడుకోరాదని రజినీకాంత్ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. రజనీకాంత్ సడన్ గా తీసుకున్న ఈ నిర్ణయం గురించి తమిళనాడులో మిశ్రమ స్పందన వస్తుంది.

 

rajanikanth with kamalhasan

 

రజినీకాంత్ స్నేహితుడు ప్రముఖ తమిళ హీరో కమల్ హాసన్ రజనీ కాంత్ తీసుకున్న నిర్ణయం గురించి కొంచెం ఘాటుగానే స్పందించారు. ఏది ఏమైనప్పటికీ రజినీకాంత్ పార్టీ పెడితే కచ్చితంగా శాసనసభ ఎన్నికలలో తన పార్టీని గెలిపించుకోవడం ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వాలి అన్నది ఆయన ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడులో ఒక రాజకీయ అస్థిరత ఉండడం వలన ఖచ్చితంగా అటు రజనీకాంత్ కు, ఇటు కమల్ హాసన్ కు ఏదైనా సంచలనం సృష్టించే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత తమిళనాడులో రాజకీయ పార్టీల బలం ఎంతో కచ్చితంగా ఒక స్పష్టత వస్తుంది. తరవాత 2021 శాసనసభ ఎన్నికల వరకు చాలా టైం ఉన్నందువల్ల ఇటు రజినీకాంత్ పార్టీ గాని అటు కమలహాసన్ పార్టీ గాని బలపడటానికి సమయం దొరుకుతుంది. ఆ తర్వాత వచ్చే శాసన సభ ఎన్నికల నాటికి ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా వెళ్తుందో అన్నది వేచి చూడాలి. Read other Articles https://www.cinemarascals.com/%e0%b0%b5%e0%b1%88%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3%e0%b0%b5-%e0%b0%a4%e0%b1%87%e0%b0%9c%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b2/

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

నాని విక్రమ్ కుమార్ సినిమా ఓపెనింగ్ స్టిల్స్

Mon Feb 18 , 2019
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: