రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు మీద డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారా??

రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు మీద డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారా??

మొన్నటికి మొన్న నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ ఆయన తండ్రి గారి మీద తీసిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అయింది ఇదే ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. కానీ ఇప్పుడు మరి ఒకసారి ఎన్టీ రామారావు జీవిత చరిత్ర వెండి తెర మీదకి రాబోతుంది మరెవరి సినిమాలో కాదు దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా. స్వతహాగా బాగా ధైర్యశాలి మొండి వాడు అయిన రాంగోపాల్ వర్మ తాను ఏ సినిమా తీసిన దాంట్లో ఏదో ఒక వివాదం ఉండేలా కచ్చితంగా చూసుకుంటారు ఎప్పుడైతే ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా గురించి అనౌన్స్ మెంట్ చేసారు ఆ క్షణం నుంచి ఈ సినిమా మీద అనేక వివాదాలు మొదలయ్యా. ఇంతవరకు వెళ్లాలంటే చివరికి తెలుగుదేశం పార్టీ నాయకులు డైరెక్టుగా టీవీ చానల్స్ లో కూడా రాంగోపాల్ వర్మ ని చంపేస్తామని బెదిరించి వార్నింగ్ ఇచ్చేంతవరకు వెళ్ళింది. దేవుడికి కూడా భయపడను అని చెప్పుకునే రాంగోపాల్ వర్మ వీరి మాటలకు దీనికి భయపడకుండా తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ చేస్తూనే ఆ సినిమాకి సంబంధించిన ఫొటోస్ స్టిల్స్ లో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నే టార్గెట్ చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో  పోస్ట్ చేస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటో
 రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి టీజర్ ని రిలీజ్ చేసినప్పుడు కూడా కేవలం ఎన్టీఆర్ ఫేస్ ను మాత్రమే చూపిస్తూ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిలీజ్ అయింది పరాజయం పాలవ్వడం ఆ తర్వాత రాబోయే ఎన్టీఆర్ మహానాయకుడు మీద ప్రేక్షకుల్లో అంచనాలు తగ్గడం గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కి బాగా పాజిటివ్ గా మారే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఆయన గురించి ఎంత గొప్పగా ఏమి చూపించలేదని సినిమాలో ఎక్కువగా ఎన్టీఆర్ ని పొగడడం జరిగింది అన్న విమర్శలు వచ్చాయి. మరి రాంగోపాల్ వర్మ తీస్తున్న సినిమాలో ఎన్టీఆర్ ను ఎలా చూపించబోతున్నాడు ఆయన గురించి ఏలాంటి నిజాలు చెప్పబోతున్నారు అన్న ఆసక్తి సగటు సినీ ప్రేక్షకుల్లో నెలకొని ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు నుంచి ఆయన జీవితం గురించి చెప్పుకుంటూ వస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకునే దగ్గర నుంచి తన కథను మొదలుపెడతానని ఇప్పటికే రాంగోపాల్ వర్మ ప్రకటించారు. బాబు నాయుడు విలన్గా చూపిస్తూ లక్ష్మీపార్వతి మీద సానుభూతి ఏమైనా సినిమాలో చూపిస్తారేమో అని ఒక చర్చ జరుగుతుంది. లక్ష్మీపార్వతి కూడా చాలాసార్లు ఈ సినిమా గురించి పాజిటివ్ గానే కామెంట్ చేసినప్పటికీ తన పాత్రని రాంగోపాల్ వర్మ వేరే విధంగా చూపిస్తే తాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని ఆవిడ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇన్ని వివాదాల నడుమ ఒక సంచలన చిత్రంగా రాబోతున్న రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల అయిన తర్వాత ఇలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది ఏలాంటి గొడవలకు దారి తీస్తుందో తెలియాలంటే ఈ సినిమా విడుదల అయ్యే వరకు ఆగక తప్పదు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

బాలీవుడ్ ప్రముఖుల తోబుట్టువులు

Sun Feb 3 , 2019
బాలీవుడ్ ప్రముఖుల తోబుట్టువులు https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: