రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజే అన్నీ చెప్తారట!!


బాహుబలి అనే సినిమాతో ఒక రేంజ్ కు వెళ్లిపోయిన దర్శకుడు రాజమౌళి… ఆయన తన సినిమాలకు పాటించే విధానాలు అన్నీ చాలా వైవిధ్యంగా వుంటాయి. తాను అఫిషియల్ గా రిలీజ్ చేయించే వరకు సినిమాకు సంబంధించిన ఏ వివరాలు కూడా బయటకు రానివ్వరు. ఎంతో గుట్టుగా పనులు చేస్తారు. పైగా ఆయన సినిమా పనులు చేసేది అంతా ఆయన కుంటుంబ సభ్యులే కాబట్టి ఎలాంటి లీక్ లు అయ్యే అవకాశాలు చాలా వరకు తక్కువగానే వుంటాయి. అలా అని రాజమౌళి సినిమా అభిమానులను నిరుత్సాహపర్చరు. ఆయనే సినిమా తయారీ నుంచి విడుదల వరకు మొత్తం మీద ఒకటి రెండు సార్లు మీడియాను కలిసి తన సినిమా గురించి నటుల గురించి ఎంతవరకు చెప్పాలో అంతా చెప్పి మళ్ళీ ఆయన పనిలో పడిపోతారు.

కొత్తగా గా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి ఇలాంటిదే ఒక మీట్ జరగబోతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అయితే ప్రస్తుతానికి 14వ తేదీని మీడియా మీట్ వుంటుందని భావిస్తున్నారు. మరి ఈ మీట్ లో రాజమౌళి తన సినిమా గురించి ఎలాంటి విషయాలు వెల్లడిస్తారో అన్నది చూడాలి. ఆర్ఆర్ఆర్ కు సంబంధించి చాలా విషయాలు పెండింగ్ లో వున్నాయి. బయటకు అందరికీ తెలిసింది కేవలం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గురించే వాళ్ళే కాక హీరోయిన్లు, విలన్ ఇంకా కీలకపాత్ర దారులు ఎవరు అన్నది సినీ అభిమానులకు తెలియాల్సి వుంది.

బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. వీటి మీద జక్కన్న క్లారిటీ ఇస్తారా? అన్నది కూడా తేలిపోనుంది. అయితే తన సినిమా మీద, సినిమా విషయాల మీద మీడియా సంధించే ప్రశ్నలకు రాజమౌళి దగ్గరి నుంచి సమాధానాలు వస్తే ఆర్ఆర్ఆర్ కు సంబంధించి అనేక విషయాలు తెలుస్తోంది. ఇవన్నీ తెలియాలి సినిమా విశేషాలు ఓ కొలిక్కి రావాలి అంటే మనం 14దాకా వెయిట్ చేయక తప్పదు.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

అయ్యో జాన్వీ అలాంటి సినిమాలోనా??

Wed Mar 13 , 2019
అందాల తార శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ సినిమా దడక్ తో హీరోయిన్ గా పరిచయమైన జాన్వి కపూర్ మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తల్లి శ్రీదేవి అందాన్ని పుణికిపుచ్చుకున్న ఈ అందాల సుందరి తన రెండో సినిమా కోసం కూడా ఇప్పుడు రెడీ అవుతుంది. మొదటి సినిమా ఒక లవ్ స్టోరీ చేసిన జాన్వి ఇప్పుడు రెండో సినిమా కోసం ఒక హారర్ జోనర్ ని […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: