రాత్ అఖేలి హై హిందీ సినిమా రివ్యూ పర్వాలేదనిపించే క్రైమ్ థ్రిల్లర్

1

రాత్ అఖేలి హై హిందీ సినిమా రివ్యూ పర్వాలేదనిపించే క్రైమ్ థ్రిల్లర్

రాత్ అఖేలి హై హిందీ మూవీ రేటింగ్  3/5

నవజుద్దిన్ సిద్దికి ప్రధాన పాత్రలో వచ్చిన హిందీ చిత్రం రాత్ అఖేలి హై ఈరోజు డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది.
ఒక ఇంట్లో మర్డర్ జరగడం, అది చేసిందెవరు అన్న పాయింట్ మీద ఇది వరకు చాలానే సినిమాలు వచ్చాయి రీసెంట్ గా హాలీవుడ్ చిత్రం “నైవ్స్ అవుట్” కూడా వచ్చింది దాదాపు అదే పాయింట్ తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ : ఉత్తర్ ప్రదేశ్ లోని ఒక చిన్న టౌన్ లో ఒక బిజినెస్ మ్యాన్ మర్డర్ జరుగుతుంది, అది కూడా 60 ఏళ్ళ ముసలాడయిన రఘుబీర్ సింగ్ తనకంటే 30 ఏళ్ళు చిన్నదయిన ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్న రాత్రే. అసలు ఆ మర్డర్ ఎవరు చేసారు? ఎందుకు చేసారు? ఈ కేసును సబ్ ఇన్స్పెక్టర్ జతిల్ యాదవ్ చేధించాడా లేడా అన్నదే మిగతా కథ.
విశ్లేషణ :
ఇదొక క్రైమ్ థ్రిల్లర్ ఒక ఇంట్లో 60 ఏళ్ళ రఘుబీర్ సింగ్ మర్డర్ జరగడం, మర్డర్ ఇన్వేస్టిగేషన్ కు వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ జతిల్ యాదవ్ కు ఇంట్లో ఉన్న అందరూ అనుమానితులాగానే కనిపించడంతో కథ మొదలవుతుంది. రఘుబీర్ సింగ్ పెళ్ళి చేసుకున్న అమ్మాయి రాధ(రాధిక ఆప్టే), అతని మేనల్లుడు విక్రం సింగ్, రఘుబీర్ సింగ్ ఆస్థిలో వాటా కోసం చూసే మిగతా కుటుంబ సభ్యులు అక్కడ లోకల్ MLA మున్నా రాజా(ఆదిత్య శ్రీ వాస్తవ) ఇలా చివరి వరకు ఎవరు చంపారు ఎందుకు చంపారు అన్న సస్పెన్స్ తో సినిమా మొదటి గంటలో పరుగులు పెడుతుంది కానీ చివరి గంటలో స్లో అయ్యి మన సహనాన్ని పరీక్షిస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ జతిల్ యాదవ్ గా నవజుద్దిన్ సిద్దికి నటనే ఈ చిత్రానికి ప్రధాన బలం, నిజాన్ని ఎప్పటికయినా బయటకు తీస్తా అంటూ తన యాక్టింగ్ తో దాదాపు సినిమా అంతా తన భుజాల మీద మోస్తూ నడిపించారు. తల్లి తనకింకా పెళ్ళి కాలేదని బాధ పడడం ఒక పెళ్ళికి వెళితే అక్కడ నవజుద్దిన్ సిద్దికి ఫోటో చూపించి మా అబ్బాయిని పెళ్ళి చేసుకుంటావా అని ఒక అమ్మాయిని అడిగితే పెద్ద కలర్ కాదు కదా అనడం కలర్ లేకున్నా మావాడికి మంచి మనసుంది అని తల్లి చెప్పడం లాంటి సీన్స్ బాగా పేలాయి. రాధికా ఆప్టే తన పాత్రలో బాగా నటించింది ఇక మిగతా పాత్రల్లో నటించిన వాళ్ళు తమతమ పాత్రలకు న్యాయం చేసారు.

రఘుబీర్ సింగ్ మర్డర్ లో కూపీ లాగిన కొద్ది నవజుద్దిన్ సిద్దికి పాత్రకు నిజాలు తెలుస్తుండడం మనల్ని కాసేపు ఇంట్రెస్టింగ్ గా కూచో పెడుతుంది కానీ ఎక్కువ డౌట్ క్రియేట్ చేసిన రాధికా ఆప్టే పాత్రతో నవజుద్దిన్ సిద్దికికి ఉన్న గతమేంటో అన్నది సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు అలాగే మొదటి నుంచి నవజుద్దిన్ సిద్దికి పాత్ర రాధిక ఆప్టేను సేవ్ చేయాలని చూస్తాడు దీనికి సినిమాలో చివరలో జస్ట్ఫిఫీకేషన్ దొరికినా ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ ప్రేక్షకుల్ని కావాలని డైవర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. తన పై ఆఫీసర్ కూడా నవజుద్దిన్ సిద్దికి పాత్రను ఆపాలని చూడడం లాంటి సీన్స్ తో ఎవరు మర్డర్ చేసుంటారు అన్నది గెస్ చేయగలిగేలా ఉన్నా కూడా చివరిలో హంతకుడి విషయంలో చిన్న ట్విస్ట్ ఇచ్చి వేరే యాంగిల్ లో ముగించారు.
దర్శకుడు హనీ ట్రేహన్ కు ఇది మొదటి సినిమా కాస్టింగ్ డైరెక్టర్ అయిన అతను ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు కథ కథనాల విషయంలో ఇంకొంచెం కసరత్తు చేసుంటే ఒక అద్భుతమైన థ్రిల్లర్ అందించే వాడు కానీ స్టొరీ విషయంలో వీక్ అయ్యే సరికి నవజుద్దిన్ సిద్దికి, రాధికా ఆప్టే లాంటి టేర్రిఫిక్ నటులు దొరికినా ఈ సినిమాను కాపాడలేకపోయారు. దర్శకత్వం నీట్ గా ఉంది, కెమెరా పనితనం ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది థ్రిల్లర్ మూడ్ కు తగినట్లుగా లైటింగ్ బాగా సెట్ అయ్యింది. సినిమాలో ఉన్న ఒక్క పాట ఓకే అనిపించేలా ఉంది సినిమా మూడ్ కు తగినట్లుగానే నేపథ్య సంగీతం సాగింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.     

చివరగా :
క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఎండ్ సస్పెన్స్ ల కాలం ఎప్పుడో చెల్లింది, ఇప్పుడు ప్రేక్షకులకు హంతకుడు ఎవరో ముందే తెలిసినా అతన్ని హీరో ఎలా పట్టుకుంటాడనేది ఇంటరెస్టింగ్ గా చూపిస్తే దాన్ని ఎంజాయ్ చేస్తాడు ఎండ్ సస్పెన్స్ సినిమాలు ప్రతిసారీ వర్కవుట్ కావు, ఈ సినిమా టైటిల్  రాత్ అఖేలి హై అంటే రాత్రి ఒంటరిగా ఉంది అన్నట్టు సినిమాలో  నవజుద్దిన్ సిద్దికి నటన ఒక్కటే ఒంటరిగా సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసింది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

One thought on “రాత్ అఖేలి హై హిందీ సినిమా రివ్యూ పర్వాలేదనిపించే క్రైమ్ థ్రిల్లర్

Leave a Reply

Next Post

లూట్ కేస్ హిందీ మూవీ రివ్యూ అలరించే క్రైమ్ కామెడీ!!!

Sat Aug 1 , 2020
లూట్ కేస్ హిందీ మూవీ రివ్యూ అలరించే క్రైమ్ కామెడీ!!! లూట్ కేస్ హిందీ మూవీ రివ్యూ రేటింగ్ 3.5/5 కరోనా క్రైసిస్ కావడంతో ఎక్కువగా ఓటిటిలలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి హిందీలో ఇది ఎక్కువగా ఉంది శకుంతలా దేవి, రాత్ అఖేలి హై లతో పాటు లూట్ కేస్ కూడా రిలీజ్ అయ్యింది క్రైమ్ కామెడీ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ :  […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: