4.1 C
New York
February 27, 2021
CINEMA RASCALS
Tollywood

“రాధే శ్యామ్” గ్లింప్స్..వాలెంటైన్స్ డే పర్ఫెక్ట్ ట్రీట్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న అందమైన తరుణం ఇప్పుడు రానే వచ్చింది. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం టీజర్ ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల కాబడింది. ప్యూర్ వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి మేకర్స్ 52 సెకండ్లు నిడివి గల గ్లింప్స్ టీజర్ ను విడుదల చేశారు.

ఇక దీనిని చూసినట్టు అయితే సింగిల్ వర్డ్ లో బ్యూటిఫుల్ అని చెప్పాలి. మొదటి నుంచీ మేకర్స్ ఈ చిత్రం ఒక అందమైన పెయింటింగ్ లా ఉంటుంది అని చెప్తూ వస్తున్నారు. ఆ మాటలను నిజం చేస్తూనే అద్భుతమైన విజులవ్స్ తో ఈ టీజర్ కనిపించింది. అలాగే ఇటాలియన్ భాషలో ప్రభాస్ డైలాగ్స్ ఆ రైల్వే స్టేషన్ వర్క్ అన్నీ ఓ సరికొత్త ప్రపంచాన్ని అంటే ఇప్పుడున్న వారికి సరికొత్త అనుభూతిని తెస్తాయి.

మరి ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంపుగా అనిపిస్తుంది. ఫైనల్ గా తన లవ్ ను విక్రమ్ ఆదిత్య ప్రేరణకు చెప్పే డైలాగ్ సింప్లి సూపర్బ్..ఓవరాల్ గా మాత్రం ఈ గ్లింప్స్ ఈ వాలెంటైన్స్ డే కు ఒక పర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పాలి. అది ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ కే కాదు ప్రేమను ఆస్వాదించే అందరికీ..అయితే ఇదే టీజర్ వీడియోలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించేసారు. సో రెబల్స్ గెట్ రెడీ..

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The post “రాధే శ్యామ్” గ్లింప్స్..వాలెంటైన్స్ డే పర్ఫెక్ట్ ట్రీట్.! first appeared on https://www.123telugu.com/telugu.

Source link

Related posts

మైత్రీ నిర్మాతల లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే ! |

cinemarascals

Daggubati Venkatesh Fan Walks 140 Kms To Meet Him

cinemarascals

“ఉప్పెన” టీంకు పవర్ స్టార్ స్పెషల్ విషెష్.!

cinemarascals

Leave a Reply

[fiverr_affiliates_search_box width="100%"]
%d bloggers like this: