రామ్ – ఇస్మార్ట్ శంకర్’ 5 డేస్ కలెక్షన్స్

రామ్ ఊచకోత – ఇస్మార్ట్ శంకర్’ 5 డేస్ కలెక్షన్స్ 


18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంక‌ర్ 5 రోజుల్లోనే 27 కోట్లు వ‌సూలు చేసిందంటే బాక్సాఫ‌స్ ద‌గ్గ‌ర శంక‌ర్ ర‌చ్చ ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అస‌లు మాస్ సినిమా అంటే ఇలా ఉంటుందా అనేలా ఈ చిత్రం వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంది. నిజానికి సినిమాలో ఏం లేక‌పోయినా కూడా మాస్ డైలాగులు.. పూరీ మార్క్ ఆటిట్యూడ్.. దీనికి శ్రీ‌రామ‌ర‌క్ష‌గా నిలిచాయి. ఇక రామ్ కూడా ఇస్మార్ట్ శంక‌ర్ పాత్ర‌కు ప్రాణం పోసాడు. హీరోయిన్ల గ్లామ‌ర్ షో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. నైజాంలో ఇప్ప‌టికే ఈ చిత్రం 10.80 కోట్లు షేర్ వ‌సూలు చేసింది…
ఇక వైజాగ్ 2.48 కోట్లు.. ఈస్ట్ 1.35.. వెస్ట్ 1.06.. కృష్ణ 1.33.. గుంటూరు 1.36.. నెల్లూరు 0.72 కోట్లు వ‌సూలు చేసింది ఇస్మార్ట్ శంక‌ర్. ఇప్ప‌టికే ఈ చిత్రం ఏపీ, తెలంగాణ‌ల్లో 21 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఓవ‌ర్సీస్ కూడా క‌లిపితే 27 కోట్ల‌కు చేరిపోయింది ఈ లెక్క‌. మొత్తానికి పూరీ కోరుకుంటున్న బ్లాక్ బ‌స్ట‌ర్ ఇన్ని రోజుల‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టికే అన్ని ఏరియాల్లోనూ సినిమాను కొన్న బ‌య్య‌ర్లు లాభాల్లోకి వ‌చ్చేసారు.

ఇస్మార్ట్ శంక‌ర్.. ఇప్పుడు ఈ చిత్రం గురించే అంతా చ‌ర్చించుకుంటున్నారు. ఒక‌టి రెండు కాదు.. నాలుగు రోజుల్లోనే ఏకంగా 24 కోట్లు షేర్ వ‌సూలు చేసి ఔరా అనిపించింది ఈ చిత్రం. ఇక ఐదో రోజు కూడా ఇదే జోరు కొనసాగింది. విడుదలైన ఐదో రోజు కూడా 2.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ రామ్ కెరీర్‌కు కూడా కావాల్సినంత ఊపు ఇచ్చింది. టెంప‌ర్ త‌ర్వాత స‌రైన విజ‌యం లేక చూస్తున్న పూరీ జ‌గ‌న్నాథ్‌కు ఈ చిత్రం ఊహించిన దానికంటే కూడా ఎక్కువే తీసుకొస్తుంది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

#JackpotTrailer releasing in less than a hour ! Get ready for a fun ride .

Tue Jul 23 , 2019
#JackpotTrailer releasing in less than a hour ! Get ready for a fun ride . https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: