రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ NTR ట్రైలర్ రివ్యూ

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్  NTR ట్రైలర్ రివ్యూ

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి రూమ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న చిత్రం లక్ష్మీస్  NTR ఇప్పటికే నందమూరి తారక రామారావు తనయుడు ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ నీ తెరకెక్కిస్తున్న  సంగతి తెలిసిందే దానిలో భాగంగా ఎన్టీఆర్ కథానాయకుడు అనే సినిమా రిలీజ్ కావడం కూడా జరిగింది దానికి అనుకున్నంతగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రాలేదు. రెండో పార్టీ ఇంకా విడుదల కావాల్సి ఉంది. అయితే మళ్లీ ఇప్పుడు రాంగోపాల్ వర్మ తన సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఒక చిన్న కుతూహలాన్ని రేకెత్తించారు. ఎన్టీఆర్ జీవితంలో ప్రముఖంగా జరిగిన వైస్రాయ్ హోటల్ ఘటన చంద్రబాబు నాయుడు వెన్నుపోటు వంటి విషయాలను ఈ సినిమాల్లో ప్రముఖంగా ఆయన చర్చించబోతున్నారు. సినిమా గురించి ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రముఖ టిడిపి నాయకుల నుంచి కార్యకర్తల నుంచి కొన్ని బెదిరింపులు కూడా రావడం జరిగింది అయినా కూడా ఆయన దీనికి బెదరకుండా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈరోజు రిలీజ్ చేసిన ట్రైలర్ లో ముఖ్యంగా ఎన్టీఆర్ భావోద్వేగాల మీదనే వర్మ దృష్టి సారించారు. ఎన్టీఆర్ ఇష్టాలని కష్టాలను కన్నీళ్లను అతను జీవితంలో ముఖ్యంగా లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఈ సినిమాలో చాలా గాఢంగా చూపించడానికి ప్రయత్నించారు అని చెప్పవచ్చు. సినిమా అంతా   ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉన్నట్టుగా ట్రైలర్ లో చూపించారు. ఎన్టీఆర్ తన జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల కుటుంబ సభ్యులు కూడా ఆయనను వ్యతిరేకించడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తో ఎన్టీఆర్ కి జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు అన్నవి ప్రముఖంగా ట్రైలర్ లో చూపించారు. అటు లక్ష్మీపార్వతి యాంగిల్ ని కూడా వర్మ ట్రైలర్ లో చూపించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ల మధ్య బంధం గురించి అప్పటి పత్రికల్లో ఏలాంటి వార్తలు వచ్చాయో కూడా ట్రైలర్ లో చూపించారు. మొత్తానికి రాంగోపాల్ వర్మ సినిమా ట్రైలర్ లో ఎమోషనల్ ఎన్టీఆర్ ని చూపించే ప్రయత్నం జరిగింది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి

Fri Feb 15 , 2019
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిజమ్మూ కాశ్మీర్ మరోసారి ఉగ్రవాదుల దాడితో రక్తమోడింది. కుటుంబ సభ్యులతో సరదాగా సెలవులు గడిపి ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ విధుల్లోకి తిరిగి వస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపైకి ఉగ్రవాదుల కార్ దూసుకొచ్చి 39 మంది జవాన్ల ప్రాణాలను బలితీసుకుంది. పాకిస్థాన్ గడ్డపై బలం పెంచుకున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడింది. 2001లో జమ్మూకాశ్మీర్ శాసనసభ పై కారు బాంబు […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: