రివ్యూ – ఎన్టీఆర్ కథానాయకుడు బాలకృష్ణ మెప్పించాడు!!

రివ్యూ: ఎన్టీఆర్ కథానాయకుడు – బాలకృష్ణ మెప్పించాడు!!

రేటింగ్: 3.5/5

రివ్యూ- ఎన్టీఆర్ కథానాయకుడు బాలకృష్ణ మెప్పించాడు!!

ఎన్టీఆర్ బయోపిక్,  నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీ రామారావు గారి బయోపిక్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. గొప్ప నటుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన ఆ మహావ్యక్తి జీవితచరిత్రను సినిమాగా తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి గొప్ప  ప్రయత్నాన్ని నందమూరి బాలకృష్ణ చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు పార్టులుగా తీశారు. మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు ఈరోజు రిలీజ్ అయింది అయితే ఈ సినిమా ఎలా ఉందో ఏంటో ఒకసారి చూద్దాం

కథ:

ఎన్టీరామారావు తాను ఒక రిజిస్ట్రార్ గా గవర్నమెంట్ ఆఫీస్ లో పని చేస్తూ సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే అక్కడ జరుగుతున్న అవినీతి తనకు నచ్చక ఆ తర్వాత ఆ జాబ్ కి రిజైన్ చేసి సినిమాల్లోకి వెళ్లాలనుకుంటాడు. అలా అనుకున్న ఎన్టీఆర్ జీవితం ఏ మలుపు తిరిగింది సినిమాల్లో ఆయన ఏ విధంగా సక్సెస్ అయ్యారు అసలు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న విషయాలు తెలియాలంటే మనం ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:

ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ ని అద్భుతంగా వేసిన హీరో నందమూరి బాలకృష్ణ గురించే. తన తండ్రి పాత్రను ఆయన ఇంత అద్భుతంగా పోషించారు అంటే కొన్నిసార్లు మనకు సాక్షాత్తు ఎన్టీరామారావు మన కళ్ళముందు ఉన్నాడా అని ఆశ్చర్యం కలిగిస్తుంది.   తన తండ్రి లా బాలకృష్ణ కూడా తన సినీ కెరీర్లో జానపద, పౌరాణిక సినిమాలు చేయడం వల్ల తండ్రి చేసిన పాత్రలు వేసేటప్పుడు బాలకృష్ణ వాటి కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాకుండానే ఆ పాత్రల్లో మనల్ని మెప్పిస్తారు. అప్పట్లో ఎన్టీరామారావు కృష్ణుడిగా రాముడిగా దుర్యోధనుడిగా విభిన్నమైన గెటప్పులు వేసి ప్రజలను ఎంతగా ఆకట్టుకున్నారో అన్న విషయాలు మనకు ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. సినిమా ఫస్టాఫ్ లో వచ్చే కృష్ణుడు సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

ఎన్టీఆర్ సాధారణ జీవితం ఆ తర్వాత సినిమాల్లోకి రావడం సినిమా ల్లో సక్సెస్ అవడం ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను అన్నింటిని దర్శకుడు క్రిష్ చాలా బాగా తెరకెక్కించగలిగారు. సినిమా కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కచ్చితంగా విజయవంతమైందని చెప్పాలి. ఈ సినిమాలో బాలకృష్ణ ఘటన తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దర్శకుడు క్రిష్ పనితనం గురించి అయినా ఆయన ప్రతి సీన్ నీ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక మహానటుడి జీవితచరిత్రను సినిమాగా తీయడం చాలా కష్టంగా ఉంటుంది కానీ దానిని క్రిష్ తన అద్భుతమైన ప్రతిభతో అలవోకగా సాధించగలిగారు. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాలో చాలా బాగుంది ముఖ్యంగా ఎన్టీఆర్ తోనే తొలినాళ్లలో సీన్స్ కానీ ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన సీన్స్ గానీ వీటిల్లో కెమెరామెన్ తన పనితనాన్ని చూపించారు. ఇక ఎం.ఎం.కీరవాణి సంగీతం ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి సినిమాలో ఉన్న పాటలతో పాటు ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి పెర్ఫెక్ట్ గా సరిపోయింది. ఆర్ట్ డైరెక్షన్, ఎడిటింగ్ బాగా ప్లస్ అయ్యాయి. ఎన్ బి కె ఫిల్మ్స్, వారాహి, విబ్రి మీడియా వారి నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

NTR గా బాలకృష్ణ నటన
డైరెక్షన్
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్
నిర్మాణ విలువలు
 కొన్ని డైలాగ్స్

మైనస్ పాయింట్స్:

స్లో నేరేషన్
ఫస్ట్ హాఫ్ సాగదీత

ఫైనల్ రిజల్ట్:

అలనాటి గొప్ప నటుడు ఎన్.టీ రామారావు గారి జీవిత చరిత్రలో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు చాలావరకు ప్రేక్షకులను మెప్పించింది. సినిమా అక్కడక్కడ కొంచెం స్లోగా ఉండడం తప్పిస్తే కచ్చితంగా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు ఇదొక మంచి విందు భోజనం అవుతుందనే చెప్పాలి.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ప్రధాని మోడీ ని కలిసిన బాలీవుడ్ తారలు

Thu Jan 10 , 2019
ప్రధాని మోడీ ని కలిసిన బాలీవుడ్ తారలు https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: