రుచి లేని చట్నీ!!! మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ రివ్యూ!!!!

రుచి లేని చట్నీ!!! మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ రివ్యూ!!!!

రుచి లేని చట్నీ!!! మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ రివ్యూ!!!!

రేటింగ్ : 2/5

middleclass melodies

సినిమా పేరు : మిడిల్ క్లాస్ మెలోడీస్
నటీ నటులు: ఆనంద్ దేవరకొండ, వర్ష బోళ్ళమ్మ, చాణక్య తేజ, గోపరాజు రమణ తది తరులు.
సంగీతం: స్వీకార్ అగస్తి
దర్శకత్వం : వినోద్ ఆంతోజు
విడుదల : అమెజాన్ ప్రైమ్

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు కూడా ఒటిటిలోనే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి.కరోనా ఇంకా తగ్గే సూచనలు కనిపించడం లేదు దాంతో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు ఇలా ఒటిటిలోకి వచ్చేస్తున్నాయి. తన మొదటి సినిమా దొరసానితో హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెలుగు తెరకు పరిచయమైన ఆనంద్ దేవరకొండ తన రెండో సినిమాగా ఈ మిడిల్ క్లాస్ మెలోడీస్ లో నటించాడు. రూరల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ : గుంటూరు దగ్గర ఒక పల్లెటూరులో తన తల్లి తండ్రి నడుపుతున్న టిఫిన్ సెంటర్ లో వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండే రాఘవ (ఆనంద్) తను బొంబాయి చట్నీ బాగా చేస్తాను అని నమ్ముతాడు. తన తండ్రిలా పల్లెటూరిలో చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకోకుండా గుంటూరు కు వెళ్లి టిఫిన్ సెంటర్ పెట్టీ సక్సెస్ అవ్వాలి అనుకుంటాడు కానీ అందుకు రాఘవ తండ్రి అడ్డు పడుతుంటాడు. ఆ తర్వాత రాఘవ ఇష్టాన్ని గుర్తించి తల్లితండ్రులు డబ్బులిచ్చి అతన్ని గుంటూరుకు పంపిస్తారు. అక్కడ టిఫిన్ సెంటర్ పెట్టిన రాఘవ సక్సెస్ అయ్యాడా లేదా అన్నదే మిగతా కథ.

విశ్లేషణ : ఇలాంటి సినిమాల్లో ఒక సాధారణ యువకుడిలా ఉన్న హీరో తనకంటూ లైఫ్ లో ఒక గోల్ పెట్టుకొని దాన్ని ఎలా సాధించాడు అన్న విషయాన్ని ఎక్కువగా చెపుతుంటారు. అయితే హీరో పాత్రకు గుంటూరుకు వెళ్లి టిఫిన్ సెంటర్ పెట్టాలి అన్న గోల్ ఉందన్న విషయం మనకు సినిమా ప్రారంభంలోనే తెలిసిపోతుంది. కానీ బాధకరమైన విషయం ఏమిటంటే అలా గుంటూరులో హోటల్ పెట్టి సక్సెస్ అవ్వాలి అనుకున్న హీరో దానికోసం ఏం చేశాడు ఎలా సక్సెస్ అయ్యాడు అన్నదే ఇక్కడ సరిగ్గా చూపించలేక పోయారు. సినిమాలో కేవలం హీరో కథ మాత్రమే కాకుండా అతను ఫ్రెండ్ కథ, ఊరిలో ఇంకో ఇద్దరు పెద్ద మనుషుల కథలు కూడా చెప్పడంతో మనకు సినిమాలో కేవలం హీరో కథ మాత్రమే కాకుండా మరికొన్ని కథలు కూడా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.ఇక తన మరదలితో హీరోకు ఉన్న లవ్ స్టోరీ అన్నది మనకు అదనంగా వచ్చే మరొక కథ అని చెప్పుకోవచ్చు. హీరో ఒకసారి తన లక్ష్యాన్ని సాధించాలని బయలు దేరాక సినిమా పరుగులు పెట్టాలి కానీ ఇక్కడ అదే మిస్ అయ్యింది. హీరో హోటల్ పెట్టిన తర్వాత సినిమా అసలు ముందుకు కదలదు అప్పుడే మనకు డౌట్ వచ్చి ఈ గ్యాప్ ఫిల్లింగ్ కోసమే డైరెక్టర్ మరొక మూడు కథలను కూడా పెట్టుకున్నాడని మనకు జ్ఞానోదయం అవుతుంది.

ఇక సినిమాలో అటు హీరో తండ్రి పాత్ర అలాగే మరొక వైపు హీరోయిన్ తండ్రి పాత్రల ద్వారా నడిపించిన కథ సాగతీతగా అనిపిస్తుంది. అసలు సినిమా మెయిన్ కథ వచ్చేసి హీరో హోటల్ పెట్టి సక్సెస్ అవడం కానీ ఇక్కడ దర్శకుడు మనకు కేవలం అతని కథను మాత్రమే చెప్పకుండా మిగతా వాటితో టైమ్ పాస్ చేయిస్తాడు. ఇక కథలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే నిజంగా హీరో చేసే చట్నీ బాగ లేదని ప్రీ క్లైమాక్స్ దగ్గర హీరోయిన్ అతనికి చెపుతుంది… మరి అదే విషయం హీరో తల్లి తండ్రులు లేకపోతే ఎప్పుడూ అతని పక్కనే ఉండే అతని ఫ్రెండ్ ఎందుకు ముందే తనకు ఆ విషయం చెప్పకుండా మోసం చేశారో దర్శకుడికే తెలియాలి. ఎందుకంటే కేవలం తాను బొంబాయి చట్నీ బాగా చేస్తాను అనే హీరో హోటల్ పెట్టాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటాడు తను చేసే చట్నీ బాగా లేనప్పుడు ఎక్కడ హోటల్ పెట్టినా ఎలా సక్సెస్ అవగలడు?? ముందు తన ప్లస్ లు ఏంటి తన మైనస్ లు ఏంటో తెలుసుకుంటే కదా అతను బిజినెస్ లో సక్సెస్ అయ్యేది?? ఇంత చిన్న విషయాన్ని కథ రాసుకునేపుడు ఎలా మిస్ అయ్యారో అర్థం కాదు.

ఈ ప్రపంచంలో ఎవరు ఏ బిజినెస్ పెట్టినా కూడా అంతో ఇంతో పబ్లిసిటీ అన్నది చేస్తారు… తన స్పెశాలిటీ బొంబాయి చట్నీ దాన్ని గుంటూరులో ఎవరూ చేయరు అని చెప్పే హీరో తన హోటల్ లో బొంబాయి చట్నీ ఫేమస్ అని కొంచెం పబ్లిసిటీ చేయించినా అతని హోటల్ కు ఏ కొద్ది జనం అయినా లేకపోతే కనీసం ఫుడ్ లవర్స్ అయినా వచ్చి ఒకసారి ట్రై చేసేవారు. కానీ అలా బిజినెస్ కోసం చేయాల్సిన మినిమం పనులు కూడా చేయకుండా హీరో హోటల్ పెట్టీ సక్సెస్ అవ్వాలి అనుకుంటాడు. ఇక తన హోటల్ సక్సెస్ అవ్వడం లేదు అనడానికి హోటల్ ముందు చెట్టు అడ్డం ఉంది అని హోటల్ వెనక చెత్త డంపింగ్ యార్డ్ ఉంది అని సిల్లీ కారణాలు చూపించిన డైరెక్టర్ సిటీలలో అయినా లేదా టౌన్ లలో అయినా రోడ్ మీద పక్కనే ఎంత చెత్తా చెదారం ఉన్నా కూడా చిన్న చిన్న టిఫిన్ బండిల దగ్గర కేవలం టేస్ట్ బాగుంటుంది అనే జనం అవేవీ పట్టించుకాకుండా ఎగబడి తింటారు అనే విషయాన్ని ఎలా మరిచిపోయాడు అన్నది ఎంత ఆలోచించినా మనకు అంతు పట్టదు.

తన హోటల్ పేరు అందరికీ కనిపిస్తుoదా అని కంగారు పడి చెట్టు కొమ్మలు పీకుతూ చెట్టును నరికేయాలి అనుకునే హీరో కనీసం హోటల్ ముందు పెద్ద బ్యానర్ ఒకటి పడేస్తే అది ఎవరికైనా కనిపిస్తుంది అన్న విషయం కూడా ఆలోచించడు అంటే అసలు ఆ పాత్రను, ఆ కథను, ఆ కథ రాసిన వాళ్ళ తెలివి తేటలు ఏ రేంజ్ లో ఉన్నాయి అన్నది మీరు ఊహించుకోవచ్చు. అన్నిటికంటే దారుణమైన విషయం మరొకటి ఉంది హీరోయిన్ హీరో చేసే చట్నీ బాగుండదు అని చెప్పిన తర్వాత చట్నీ బాగా చేయడానికి హీరో ట్రై చేసి ఫెయిల్ అయ్యి హీరో తన హోటల్ ముందు కూర్చుంటే అక్కడే చెట్టు పై నుంచి ఒక మామిడికాయ కింద పడుతుంది(న్యూటన్ చెట్టు కింద కూర్చుంటే పడ్డట్టు అనుకున్నారేమో మరి???) హీరో ఆ మామిడికాయ తీసుకెళ్లి చట్నీ చేస్తాడు దాంతో అది అద్భుతంగా ఉంటుంది అది తిన్న తండ్రి కూడా మెచ్చుకుంటాడు. అసలు తను చేసే చట్నీ బాగుండదు ముందు అది బాగా చేయడం నేర్చుకోమని తండ్రి కొడుక్కి ఊర్లో ఉన్నప్పుడే చెపితే కొడుకు గుంటూరు దాకా వచ్చి హోటల్ పెట్టీ ఫెయిల్ అయ్యి ఎప్పుడో ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ తనకు చెప్పిన తర్వాత చట్నీ చేయడం నేర్చుకుని సక్సెస్ అవడు కదా. మరెందుకు ఇదంతా దర్శకుడు ముందే జరిగేలా కథ రాసుకోలేదు??? అంటే ఇది కేవలం బిగినింగ్ అండ్ ఎండ్ మాత్రమే ఉన్న ఒక హాఫ్ బెకెడ్ స్టోరీ అని ఏదో తమకు తోచింది రాసేసి సినిమా తీశారు అని అసలు కథ మీద ఎలాంటి కసరత్తు చేయలేదు అని తేలుతుంది.ఇక సినిమా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్న తర్వాత హోటల్ కు వెళ్ళేసరికి హోటల్ అంతా కస్టమర్స్ తో నిండి పోతుంది అసలు అప్పటి వరకు ఆ హోటల్ కు ఎవరూ రారు కానీ కేవలం ఒక్క రోజులోనే ఏం జరిగింది ఎలా హోటల్ కస్టమర్స్ తో నిండిపోయింది అన్నది ఒక మేజిక్ లా చూపిస్తాడు దర్శకుడు అసలు అలా ఎలా జరిగింది అని మనం జుట్టు పీక్కోడమే తక్కువ.

ఇక సినిమాలో హీరో పాత్ర గురించి అతని నటన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ సినిమాలో ఉన్న అతి కొన్ని పాజిటివ్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే హీరోయిన్ వర్ష తన పాత్రకు న్యాయం చేసింది. అలాగే హీరో ఫ్రెండ్ గా చేసిన అబ్బాయి అలాగే సెల్ ఫోన్ షాప్ లో పనిచేస్తూ అతన్ని ఇష్ట పడే అమ్మాయి హీరో తండ్రి పాత్ర చేసిన నటుడు అక్కడక్కడ తమ సహజమైన నటనతో వాళ్లే ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యారు. సినిమాలో కామెడీ కానీ అలాగే డైలాగ్స్ కానీ చెప్పుకోతగ్గ స్థాయిలో లేవు. కెమెరా పనితనం బాగుంది అలాగే మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అద్భుతమైన పాటలు ఏవీ రాకపోయినా కూడా సినిమా మూడ్ కు తగ్గట్లుగా మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : తను బొంబాయి చట్నీ బాగా చేస్తాను అని హీరో తనను తాను నమ్మడం వరకూ బాగానే ఉంది కానీ అసలు తను చేసే చట్నీ బాగుందా లేదా అని ఎవరినైనా నిజాయితీగా చెప్పమని అడిగుంటే ఇలా రుచి లేని చట్నీలా సినిమా తయారయ్యేది కాదు.

Leave a Reply

Next Post

Sexy Rakul Preet Singh Posed Alluring 😋😋😋😋😋

Mon Nov 23 , 2020
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: