రేపు విడుదల అవుతున్న భారత పైలెట్ అభినందన్


పుల్వామ దాడి ఘటన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న జైషే మహమ్మద్ తీవ్ర వాద క్యాంప్ ల మీద భారత ఆర్మీ ఆకస్మిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటన తర్వాత కొన్ని పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత భూ భాగంలోకి చొచ్చుకురావడంతో వాటిని తరిమి కొడుతూ భారత యుద్ధ విమానాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. అయితే అందులో భాగంగా మన విమానం ఒకటి పాక్ భూభాగంలో కూలిపోయి మన పైలెట్ అభినందన్ పాక్ ఆర్మీ అధికారులకు చిక్కారు. దాంతో అది పెద్ద ఇష్యూ అయ్యి మన పైలెట్ ను విడి చి పెట్టాలని పాకిస్తాన్ మీద ఇండియా తో పాటు ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఒత్తిడి తెచ్చాయి దాంతో చివరకు పాక్ దిగి వచ్చి రేపు అభినందన ను రిలీజ్ చేస్తున్నామని పాకిస్తాన్ పార్లమెంట్ లో ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఇండియా తీవ్ర వాద శిబిరాల మీద అలాగే పాకిస్తాన్ యుద్ధ విమానాల మీద దాడులు చేయడం తిట్టడం వెనక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. అమెరికా లాంటి పెద్ద దేశం కూడా భారత్ కు మద్దతు ఇచ్చి పాకిస్తాన్ మీద తీవ్ర ఒత్తిడి తెచ్చింది దాంతో తప్పు తనేదే అని గ్రహించి తోక ముడిచిన పాకిస్తాన్ ఇప్పుడు అభినందన్ రిలీజ్ చేస్తామని చెపుతూ ఇలా మన మీద అసత్య ఆరోపణలు చేస్తుంది. ఉగ్ర వాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ఇప్పుడు శాంతి అని దొంగ నాటకాలు ఆడుతోంది.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

శ్రీదేవి మామ్ సినిమా చైనా లో విడుదల

Thu Feb 28 , 2019
లెజెండరీ నటి శ్రీదేవి నటించిన సినిమా మామ్ హిందీ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. దీనిలో నటనకు గాను శ్రీదేవి గారికి వుత్తమ నటిగా నేషనల్ అవార్డు లభించింది. మామ్ తో శ్రీదేవి నటిగా 300 సినిమాలు పూర్తి చేసుకుంది. ఆవిడ 50 ఏళ్ళ కెరీర్ లో ఇదొక మరపు రాని చిత్రంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: