లారీ డ్రైవర్‌గా అల్లు అర్జున్.. అదిరిపోయే మాస్ ఫార్ములాతో..

అదిరిపోయే మాస్ ఫార్ములాతో..

                  లారీ డ్రైవర్‌గా అల్లు అర్జున్..

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఆర్య, ఆర్య2 రాగా.. ఇది మూడవ చిత్రం. 
Image
 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది, రంగస్ధలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అది అలా ఉంటే తాజాగా ఈ సినిమాలో బన్నీ రోల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో కనబడుతూ.. లారీ డ్రైవర్‌గా అదరగొడుతాడని సమాచారం. 
Image
ఈ సినిమా కథ ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటంతో సినిమాలో చాలా వరకు క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ భావించి.. ఆ పాత్రల్లో కొంతమంది కొత్త నటీనటులకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నాడు. ఇంకోంత సమాచారం ఏమంటే ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే  తెరకెక్కబోతుందని తెలుస్తోంది. 
Image
సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. బన్నీతో ఈ తాజా చిత్రం కూడా అదే ఫార్ములాతో వస్తోంది. చూడాలి మరి.. సుకుమార్ రంగస్ధలం మ్యాజిక్ రిపీట్ చేస్తాడా.. అంతకు మించి ఈ సినిమా ఉండనుందా..
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

సరిలేరు నీకెవ్వరు -- ఓవర్సీస్‌లో దుమ్ములేపుతున్న మహేష్..

Sun Jan 12 , 2020
  సరిలేరు నీకెవ్వరు —     ఓవర్సీస్‌లో దుమ్ములేపుతున్న మహేష్.. మహేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ వచ్చిన మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి పండుగ సంరద్భంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే అనేక చోట్ల ప్రీమియర్ షోల ప్రదర్శన జరుగగా అంతటా దాదాపు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా యూఎస్‌ ప్రీమియర్స్ కూడా అదరగొడుతోంది. అక్కడ ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు మహేష్ సరిలేరు నీకెవ్వరు […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: