లూట్ కేస్ హిందీ మూవీ రివ్యూ అలరించే క్రైమ్ కామెడీ!!!

0 0
Read Time:8 Minute, 31 Second

లూట్ కేస్ హిందీ మూవీ రివ్యూ అలరించే క్రైమ్ కామెడీ!!!

లూట్ కేస్ హిందీ మూవీ రివ్యూ రేటింగ్ 3.5/5

కరోనా క్రైసిస్ కావడంతో ఎక్కువగా ఓటిటిలలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి హిందీలో ఇది ఎక్కువగా ఉంది శకుంతలా దేవి, రాత్ అఖేలి హై లతో పాటు లూట్ కేస్ కూడా రిలీజ్ అయ్యింది క్రైమ్ కామెడీ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ : 
ఒక న్యూస్ పేపర్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసి అర్ధరాత్రి తన జాబ్ ముగించుకుని ఇంటికి వస్తున్న చిరుద్యోగి నందన్(కునాల్ ఖేము) కు అనుకోకుండా ఒక పెద్ద సూట్ కేస్ దొరుకుతుంది దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాన్నిండా రెండు వేల రూపాయల కట్టలు అవి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈ సూట్ కేస్ ఎవరిదీ అంటూ అడుగుతాడు కానీ చుట్టు పక్కల ఎవరు ఉండరు దాంతో ఆ సూట్ కేస్ తీసుకొచ్చి తన పక్కింట్లో ఉండే రామన్ లాల్ ఇంట్లో ఆ సూట్ కేస్ దాస్తాడు. ఇక ఆ మనీ ఎలా ఖర్చు పెట్టాలి అని ట్రై చేస్తుంటాడు? మరొక వైపు MLA పాటిల్ సాబ్, మినిస్టర్ త్రిపాఠి కి ఆ డబ్బు తో సంబంధం ఏంటి? పోలీసాఫీసర్ కోట్లే ఆ సూట్ కేస్ కోసం ఎం చేసాడు? అసలు ఆ మనీ ఎవరిది? ఆ డబ్బు తన దగ్గర పెట్టుకున్న నందన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడు అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :
నెలంతా కష్టపడితే వచ్చే జీతం, చిన్న ఇంట్లో కాపురం కొడుకును బయట పార్కులకు కూడా తీసుకెళ్ళలేని మనీ క్రైసిస్ లో ఉన్న నందన్ కు డబ్బు దొరకడం అన్నది ఎప్పుడూ వర్క్ అవుట్ అయ్యే పాయింట్ ఈ సినిమాలో అది బాగా పేలింది. ఇంట్లో మనీ ప్రాబ్లం ఉందని నాకు తెలుసు నాన్న కానీ పార్క్ టూర్ మాత్రం కాన్సల్ చేయద్దు అని కొడుకు అనడం, ఒక్క జాబే కాదు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం డబ్బు తీసుకురండి అని పోరే భార్య, ఆఫీస్ లో అసలు శాలరీ పెంచకుండా తనతో ఎక్కువ షిఫ్ట్ లు వర్క్ చేయించే బాస్ వీళ్ళందరి మధ్య నందన్ కు సూట్ కేస్ దొరకడం ఒక పెద్ద రీలీఫ్ ఇస్తుంది దాంతో మెల్లి మెల్లిగా ఆ డబ్బు తీసి ఖర్చు పెడుతుంటాడు. అయితే ఆ సూట్ కేస్, దాంట్లో ఒక ముఖ్య మైన ఫైల్ ఉండడంతో మినిస్టర్ త్రిపాఠి ఎలాగైనా దాన్ని తీసుకురమ్మని MLA పాటిల్ ను ఫోర్సు చేయడం అతను పోలీసాఫీసర్ కొట్లేకు ఆ పని అప్పగించడం ఈ ప్రాసెస్ లో రెండు గ్యాంగ్ స్టార్ ముఠాలు ఇన్వొల్వె అవడంతో కథ మంచి గ్రిప్పింగ్ గా సాగుతుంది నందన్ ఎప్పుడూ ఎలా దొరికిపోతాడు అన్నదే ఇక్కడే ప్రేక్షకులను హుక్ చేసే పాయింట్.
నందన్ గా చేసిన కునాల్ ఖేము తన పాత్రలో అద్భుతంగా నటించాడు ఒక సాధారణ చిరుద్యోగిగా భార్యను నాన్ వెజ్, చైనా ఫుడ్ అంటూ రొమాంటిక్ గా పిలిచే భర్తగా కష్టపడి పని చేసే ఉద్యోగిగా అన్ని వేరియేషన్స్ బాగా చూపించాడు. తనకు డబ్బు దొరికిన తర్వాత ఆ సూట్ కేస్ తో ఇన్నాళ్ళు ఎక్కడున్నావ్ అంటూ మాట్లాడ్డం దానికో పేరు పెట్టుకోవడం ఇవన్నీ కామన్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సీన్స్, డబ్బును ఇంట్లో చాలా ప్లేసులలో దాయడం పక్కింటి రామన్ లాల్ ఇంటి కీస్ పనోడికి ఇచ్చా అని భార్య సినిమా ధియేటర్ లో చెపితే కంగారు పడి రావడం, చివరలో షూటౌట్ జరుగుతున్నప్పుడు విజయ్ రాజ్ ఫైరింగ్ చేస్తూ గన్ మ్యాగజైన్ అడిగితే పక్కనే ఉన్న నేషనల్ జియోగ్రపిక్ మ్యాగజైన్ ఇవ్వడం తుం కిస్కా ఆద్మీ తోమర్? యా అబ్దుల్? అంటే లతా మనిషిని అని తన భార్య పేరు చెప్పడం లాంటి సీన్స్ బాగా పేలాయి. ఇక గ్యాంగ్స్టర్ బాలా రాథోర్ గా విజయ్ రాజ్ నటన ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ నేషనల్ జియోగ్రపిక్ ఛానల్ లో జంతువుల షోస్ చూస్తూ వాటిని అసలు పేర్లతో కాకుండా శాస్త్రీయ పేర్లతో పిలవడం లైఫ్ లో వాటిలా తెలివిగా బతకలాని చెప్పడం తన మనుషుల్ని నేషనల్ జియోగ్రపిక్ ఛానల్ సబ్ స్క్రిప్షన్ తీసుకోండి అని తిట్టడం ఇలా తను చేసిన ప్రతీ సీన్ బాగా పండిది.

MLA పాటిల్ గా గజ రాజ్ రావు సినిమాకు ఇంకో ఎస్సెట్ తన డైలాగ్ డెలివరితో నేను మంచే మాట్లాడుతున్నా కానీ జనాలు చెడుగా అర్థం చేసుకుంటున్నారు అంటూ తన మాటే నెగ్గేలా చేయడం లాంటి సీన్స్ లో ఆయన నటన బాగుంది. నందన్ భార్యగా రసిక దుగల్ నటన అతని కొడుకుగా ఆర్యన్ ప్రజాపతి నటన పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇక సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పోలీసాఫీసర్ కోట్లే పాత్ర చేసిన రణవీర్ శోరే గురించి MLA పాటిల్ తన పాత ఎన్కౌంటర్ కేసుల గురించి భయపెట్టడంతో సూట్ కేస్ ఎక్కడుందో కనుక్కోవడానికి ట్రై చేయడం చివరకు నందన్ ను పట్టుకోవడం ఫైల్ చదివి MLA పాటిల్ కు ఎదురుతిరగడం ఇలా తన పాత్రే ఎక్కువగా కథను ముందుకు నడిపింది. సినిమా చివరలో షూటౌట్ జరిగాక భార్యతో ఫోన్ లో మాట్లాడుతూ మళ్ళీ తన సంచి కోసం నందన్ వెతుక్కుని అది తీసుకోవడం మనకు ఈ డబ్బు ఇవేవి వద్దు మన నార్మల్ లైఫే బాగుంది అంటుంటే మళ్ళీ సూట్ కేస్ కింద పడడం పక్కనున్న బాక్స్ లలో డబ్బు కనిపించడం చూసిన నందన్ ఏం చేస్తాడు అన్నది ప్రేక్షకుల ఊహాకే డైరెక్టర్ వదిలేసాడు. ఇక డైరెక్టర్ రాజేష్ క్రిష్ణన్ కు ఇదే మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా తడ బడకుండా నీట్ గా తీసాడు ముఖ్యంగా స్టొరీ విషయంలో మంచి కసరత్తు చేయడంతో ఆయన పని సులువైంది, డైలాగ్స్ రాసిన కపిల్ సావంత్ మంచి టాలెంట్ కనబరిచాడు. సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది సినిమాలో ఉన్న ఒక్క పాట బాగుంది అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
చివరగా :
ఒక సగటు మనిషికి కొన్ని కోట్లు ఉన్న సూట్ కేస్ దొరికితే ఎం జరుగుతుంది తనది కానీ డబ్బు మీద మనిషి ఆశ పడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఈ సినిమాలో ఫన్నీగా చూపించారు. మంచి కామెడీ, టెర్రీఫిక్ యాక్టర్స్ ఉన్న ఈ క్రైమ్ కామెడీ మంచి  టైం పాస్ సినిమా అనడంలో ఎలాంటి డౌట్ లేదు.           
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Menu
%d bloggers like this: