వరల్డ్ ఫేమస్ లవర్ 2 డేస్ కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు కొండంత కష్టం

వరల్డ్ ఫేమస్ లవర్ 2 డేస్ కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు కష్టం

వరల్డ్ ఫేమస్ లవర్ 2 డేస్ కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు కొండంత కష్టం..
ఈ సినిమా బిజినెస్ 20 కోట్లకు పైగానే జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అంత దూరం విజయ్ ఈ సినిమాను తీసుకెళ్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. సినిమాలో కేవలం సింగరేణి ఎపిసోడ్‌కు మాత్రమే మంచి పేరొచ్చింది. అది మినహా చూడ్డానికి కూడా ఏం లేదని విమర్శకులు కూడా తేల్చడంతో వసూళ్లపై ఆ ప్రభావం పడుతుంది. మరి చూడాలిక.. వరల్డ్ ఫేమస్ లవర్‌ను తన ఇమేజ్‌తో విజయ్ ఎంత దూరం తీసుకెళ్తాడో..?
విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ కలెక్షన్స్ (world famous lover collections)
క్రాంతి మాధవ్ తెరకెక్కించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కలెక్షన్స్ నిరాశ పరుస్తున్నాయి. విజయ్ దేవరకొండ రేంజ్‌కు సరిపోయేలా ఈ చిత్ర వసూళ్లు రావడం లేదు. ముందు నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలున్నా కూడా విడుదల తర్వాత టాక్ తేడాగా రావడంతో కలెక్షన్లపై ప్రభావం భారీగానే పడుతుంది. విజయ్ గత సినిమాలతో పోలిస్తే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. రెండేళ్ల కింద గీత గోవిందం సినిమాతో తొలిరోజే 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత గతేడాది విడుదలైన డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయినా కూడా తొలిరోజే 12 కోట్ల షేర్ వసూలు చేసింది.
విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ కలెక్షన్స్ (world famous lover collections) 
డిజాస్టర్ అయిన నోటా కూడా తొలిరోజే 8 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. అంటే దాదాపు స్టార్ హీరో రేంజ్ అన్నమాట. కానీ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం తొలిరోజు కేవలం 5 కోట్లతో సరిపెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 5.53 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇక దాంతోపాటు రెండో రోజు కూడా కలెక్షన్స్ మెరుగుపడలేదు. సెకండ్ డే ఈ సినిమా 2.4 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో వరల్డ్ ఫేమస్ లవర్ 8 కోట్ల షేర్ వసూలు చేసింది…!!!! 
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కుక్క బిస్కెట్స్ తింటున్న స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ షాక్...???

Sun Feb 16 , 2020
కుక్క బిస్కెట్స్ తింటున్న స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ షాక్…??? ఈ విషయాన్ని స్వయంగా ఈమె నోటితోనే చెప్పుకొచ్చింది. అయితే ఈ సీక్రేట్ బయటపెట్టింది మాత్రం హీరో నితిన్. (RASHMIKA MANDANA & NITHIIN) అంత వింత అలవాటు ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. రష్మిక మందన్న. పైగా హీరో నితిన్‌ ఇదే విషయాన్ని చెప్పాడు కూడా. అయితే చెప్పనీయకుండా రష్మిక ఆయన నోరు నొక్కే ప్రయత్నం చేసింది. ఇక […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: