వరుణ్ తేజ్ హరీష్ శంకర్ ల వాల్మీకి

వరుణ్ తేజ్ హరీష్ శంకర్ ల వాల్మీకి

జిగర్ తండా తమిళ్ లో మంచి హిట్ సాధించిన ఈ సినిమాలో హీరో సిద్దార్థ్ తమిళ నటుడు బాబీ సింహ నటించారు బాబీ సింహ నటనకు ఈ సినిమాకి గాను ఆయనకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. అయితే ఇప్పుడు మళ్లీ తెలుగులో హరీష్ శంకర్ ఈ సినిమాను వరుణ్ తేజ్ నాగశౌర్య లతో కలిసి రీమేక్ చేయబోతున్నారు. వరుణ్ తేజ్ తన కెరీర్ లో మొదటి సారిగా ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడు. సినిమా తీద్దాం అని బయలుదేరిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మధురై లో ఉన్న ఒక రౌడీ నిజ జీవిత కథ ఆధారంగా తన సినిమాను తీయాలనుకోవడం అందుకోసం అతన్ని వెళ్లి కలవడం చివరికి తన్నే హీరోగా పెట్టి తన జీవిత చరిత్ర తీయాలని ఆ రౌడీ అసిస్టెంట్ డైరెక్టర్ కి కండిషన్ పెట్టడం చివరకు చేసేదేమీ లేక అసిస్టెంట్ డైరెక్టర్ ఆ రౌడీ కి భయపడి ఆ రౌడీ తోనే సినిమా తీయడం కానీ అతనినీ సినిమాలో కామెడీ గా చూపించడం దాంతో అసిస్టెంట్ డైరెక్టర్ ని ఆ రౌడీ చంపాలని తిరగడం చివరకి సినిమా వల్ల ఆ రౌడీ లో మార్పు వచ్చి అతను మారడం ఈ సినిమా ప్రధాన కథ. రౌడీగా వరుణ్ తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా నాగశౌర్య ఈ సినిమాలో కనిపించబోతున్నారు వచ్చి ఇన్ని సంవత్సరాలు దాటిన తర్వాత తెలుగులో దీన్ని రీమేక్ చెయ్యాలనుకోవడం ఒక విధంగా సాహసమనే చెప్పాలి కానీ కథలో కొత్త పాయింట్ ఉండడం వల్ల ఇది జనాన్ని ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు ఈ సినిమా కి హరీష్ శంకర్ ఎలాంటి మార్పులు చేర్పులు చేసి తీస్తారు అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కలెక్షన్స్ కొల్లగొడుతున్న కంగనా రనౌత్ మణికర్ణిక

Mon Jan 28 , 2019
 కలెక్షన్స్   కొల్లగొడుతున్న కంగనా రనౌత్ మణికర్ణిక ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా కంగనా రనౌత్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం మణికర్ణిక  శుక్రవారం రోజు రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే 50 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టిని కురిపిస్తుంది. సినిమా విడుదలకు ముందు కొన్ని వివాదాల కారణంగా సినిమా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: